టొరంటో : కెనడాలోని టొరంటో నగరంలో ఖలిస్థానీ మద్దతుదార్లు ఆందోళన చేపట్టగా
దీనికి దీటుగా భారత జాతీయులు కూడా స్పందించారు. శనివారం భారత కాన్సులేట్
కార్యాలయం ఎదుట ఇరు పక్షాలు పోటాపోటీగా జెండాలను పట్టుకొని ప్రదర్శనకు దిగాయి.
తొలుత ఖలిస్థానీలు ఇక్కడకు వచ్చి ఆందోళన చేపట్టగా భారత్‌కు మద్దతుగా కూడా
ప్రదర్శనలు మొదలయ్యాయి. మరోవైపు జులై 8న ఆందోళనలు చేపట్టాలని గత కొన్ని
రోజులుగా ఖలిస్థాన్ మద్దతుదార్లు ఆన్లైన్లో ప్రచారం చేపట్టిన విషయం
తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉన్న భారత
దౌత్యకార్యాలయానికి భద్రతను పెంచారు. ఇక్కడ కూడా ఖలిస్థాన్ మద్దతుదార్లు
ఆందోళన చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం అందడంతో ఈ చర్యలు తీసుకున్నారు.
ఇప్పటివరకు ఎటువంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోలేదు. భారత దౌత్యవేత్త తరణ్‌జీత్
సింగ్ సంధు ఎంబసీ వద్ద పరిస్థితిని పర్యవేక్షించారు.