7 ఎళ్ళ క్రితం 10 లక్షలు తో సుందరం గా నిర్మాణం.
రాత్రుళ్ళు మందుబాబు లు కు అడ్డా గా కేంద్రం.
చోద్యం చూస్తున్న ఐ సి డి ఎస్ అధికారులు.
కలువాయి.
పిల్లులు చదువు కునేందుకు భవనాలు లేక అద్దె భవనాల్లో విద్యాభ్యాసం చేస్తుంటే… ఉన్న భవనాన్ని ఐ సి డి ఎస్ అధికారులు ట్రాక్టర్ ల షెడ్ కు వదిలేసిన సంఘటన కలువాయి మండలం వెరుబోట్ల పల్లి లో చోటుచేసుకోంది. పిల్లలకు ఆహ్లాధాకరమైన వాతావరణం లో విద్యా బుద్దులు నేర్పించాలని ప్రభుత్వం దాదాపు 10 లక్షలు ఖర్చు పెట్టి గ్రామ సచివాలయం పక్కన సర్వంగ సుందరం గా అంగన్వాడీ భవనాన్ని నిర్మించారు. గోడల పై చక్కటి బొమ్మల కొలువు తో సుందరం గా వేశారు. 4 సంవత్సరాల నుంచి పిల్లలు ఆ భవనం లో చక్కగా చదువు కున్నారు. అయితే ఇక్కడ పని చేసే కార్యకర్త, ఆయాల సౌలభ్యం కోసం చక్కటి భవనాన్ని వదలేసి పాఠశాల భవనం లోనికి వెళ్లారు. ఆనందం గా నిర్మించిన అంగన్వాడీ భవనం ను వదిలేసి వెళ్లడం పలు అనుమానాలకు తావునిస్తుంది. అంగన్వాడీ భవనం ను ఖాళీ చేసి పోవడం తో ఆ భవనాన్ని ట్రాక్టర్ ల షెడ్ కు వాడుకొంటు న్నారు.పగలు ట్రాక్టర్ షెడ్ కు రాత్రి పూట మందుబాబు కు అడ్డా గా మారింది. చక్కగా ఉన్న భవనం దుమ్ము దూళి పట్టి అశుభ్రం గా తయారు అయింది. అంగన్వాడీ భవనం ను ఖాళీ చేసి వెళ్లిన ఇక్కడ పని చేసే సూపర్ వైజర్ సైతం మౌనం వహిస్తున్నారు. అంగన్వాడీ భవనాన్ని వదిలేసి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన ఈ చిన్న పిల్లలు పై అంతస్థులో ఉంటున్నారు. తెలిసి తెలియని వయస్సు పిల్లలు అట్లాడుకొనే సమయంలో అదుపు తప్పితే ప్రమాదం జరిగే అవకాశం మెండుగా ఉంది. పాఠశాల లో భోజనం సమయంలో పిల్లలను మరుగుదొడ్లు వద్ద భోజనం పెడుతున్నారు. మరుగుదొడ్ల నుంచి వచ్చే దుర్వసనను పిల్లలు పీల్చుతూ భోజనం సమయంలో ముక్కులు మూసుకొంటున్నారు.అంగన్వాడీ భవనం వద్ద పరి శుభ్రమైన వాతావరణం పిల్లలు ఆరోగ్య వంతం గా ఉన్నారు. పాఠశాల లో మరుగుదొడ్లు వద్ద భోజనం తింటే పిల్లలు అనారోగ్యం పాలు అవుతున్నారని గ్రామస్తులు చర్చించుకొంటున్నారు. ఐసీడి ఎస్ ఉన్నతధికారులు తనిఖీ చేస్తే ఇక్కడ పరస్థితి వెలుగు లోనికి వస్తుంది. వేరుబోట్లపల్లి గ్రామం లో ట్రాక్టర్ షెడ్ గా… మందుబాబులకు అడ్డా గా మారిన అంగన్వాడీ కేంద్రాన్ని ఉపయోగం లోనికి తీసుక రావాలని గ్రామస్తులు కోరుతున్నారు.