క్యాంపస్ లో విద్యార్థులతో ముఖాముఖి
అమరావతి : హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటోంది. ఈ
ఉత్సవాల్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కూడా
పాల్గొంటున్నారు. ఆయన వూధవారం (ఆగస్టు 23) ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో
విద్యార్థులతో ముఖాముఖి సమావేశం కానున్నారు. ట్రిపుల్ ఐటీ ఆవిర్భావం, ఐటీ రంగ
అభివృద్ధి వంటి అంశాలపై విద్యార్థులతో చర్చించనున్నారు. బుధవారం సాయంత్రం 5
గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ సిల్వర్
జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా యాజమాన్యం కొన్ని రోజులుగా పలు కార్యక్రమాలు
నిర్వహిస్తోంది. అందులో భాగంగానే విద్యార్థులతో చంద్రబాబు ముఖాముఖి సమావేశం
ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న
సమయంలోనే, 1998లో హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ఏర్పాటైంది.