రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్
సింగ్‌పై వచ్చిన పలు ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటు చేసిన పర్యవేక్షణ
కమిటీలో కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ రెజ్లర్ బబితా ఫోగట్ కు చోటు
లభించింది. క్రీడా మంత్రిత్వ శాఖ ఈ పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది.
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌పై లైంగిక దుష్ప్రవర్తన, వేధింపులు, బెదిరింపులు, ఆర్థిక
అవకతవకలు, పరిపాలనా లోపాల ఆరోపణలపై ఈ కమిటీ విచారణ జరుపుతోంది. వినేష్ ఫోగట్,
బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, రవి దహియా వంటి ప్రముఖులు ఈ ఆరోపణలు చేశారు.
“రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రోజువారీ పరిపాలన చేపట్టేందుకు యువజన
వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన పర్యవేక్షణ కమిటీ
ప్యానెల్లో మాజీ రెజ్లర్ బబితా ఫోగట్‌ను చేర్చారు” అని మంత్రిత్వ శాఖ ఒక
ప్రకటనలో తెలిపింది. లెజెండరీ బాక్సర్ ఎంసీ మేరీ కోమ్ నేతృత్వంలోని పర్యవేక్షణ
కమిటీలో బబిత ఆరవ సభ్యురాలు. మాజీ రెజ్లర్ యోగేశ్వర్ దత్, మాజీ షట్లర్ తృప్తి
ముర్గుండే, రాధిక శ్రీమాన్, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ మాజీ సీఈఓ రాజేష్
రాజగోపాలన్ ఇప్పటికే సభ్యులుగా ఉన్నారు.