ఆల్ కాపీ బాబు..నకిలీ బాబుకు 2024లోనూ పరాభవం తప్పదు
ఆంధ్ర ప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్
గుంటూరు : మేనిఫెస్టోనే మాయం చేసిన ఘనుడు చంద్రబాబు. ఆయన చరిత్రే నకిలీ చరిత్ర
అంటూ ఆంధ్ర ప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ సీరియస్ కామెంట్స్
చేశారు. ఆల్ కాపీ బాబు..నకిలీ బాబుకు 2024లోనూ పరాభవం తప్పదు. పొత్తులు
లేకుండా ఎన్నికలకు వెళ్లలేని పిరికిపంద చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. మంత్రి
జోగి రమేష్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ ‘డర్టీ బాబు.. టిష్యూ మేనిఫెస్టో.
2014 ఎన్నికల్లో 650 వాగ్దానాలు చేసి గాలికొదిలేశాడు. 650 వాగ్దానాల్లో 10
హామీలైనా నెరవేర్చలేదు. మేనిఫెస్టోను మాయం చేసిన ఘనుడు చంద్రబాబు. 14 ఏళ్లు
అధికారంలో ఉండి చంద్రబాబు చేయలేని అభివృద్ధిని కేవలం నాలుగేళ్లలోనే
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసి చూపించారు. వచ్చే ఎన్నికల్లోనూ
సింగిల్గానే పోటీ చేస్తాం అని జోగి రమేష్ వెల్లడించారు.
పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లలేని పిరికిపంద చంద్రబాబు. 14 ఏళ్లు సీఎంగా
ఉన్నప్పుడు నిరుద్యోగ భృతి ఏమైంది?. అని జోగి రమేష్ ప్రశ్నించారు. 14 ఏళ్ళలో
ఉచిత బస్సు ప్రయాణం ఎందుకివ్వలేదు?. రుణమాఫీ అంటూ చంద్రబాబు రైతులను మోసం
చేశాడు. 2024 ఎన్నికల్లోనూ చంద్రబాబును బీసీలు తరిమితరిమి కొడతారు. పేదల
రక్తాన్ని పీల్చిపిప్పిచేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని విమర్శించారు. ఆయన
వేషాలను ప్రజలు గమనిస్తున్నారు. 2024 ఎన్నికల తర్వాత టీడీపీ అడ్రస్ గల్లంతే.
చంద్రబాబు ఇక హైదరాబాద్ లేక సింగపూర్లో వెళ్ళిపోవడం ఖాయం అని జోస్యం
చెప్పారు. కేబినెట్లో ఒక్క బీసీకైనా చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చాడా?. కానీ,
సీఎం జగన్ కేబినెట్లో సామాజిక న్యాయం చేశారు. సీఎం జగన్ మాట
చెప్పాడంటే..చేస్తాడంతే. పేదలను సంపన్నులుగా చేయగలిగే వ్యక్తి సీఎం జగన్.
అన్ని రంగాల్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్. ముఖ్యమంత్రి జగన్
గురించే మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. పేదలకు ఇళ్ల స్థలం ఇస్తుంటే
కోర్టులకెళ్లి అడ్డుకున్నావు. ఇప్పుడు పేదల ఆదాయం రెట్టింపు చేస్తానంటున్నాడు.
మేనిఫెస్టో అంటే బాధ్యత ఉండాలి. ఒక మాట ఇస్తే దాని కోసం ఎంతవరకైనా పోరాడాలి. ఈ
క్రమంలోనే మహానాడులో ప్రవేశపెట్టిన టీడీపీ మేనిఫెస్టోను మంత్రి జోగి రమేష్
చించేసి చెత్త బుట్టలో పడేశారు.