నాటా తెలుగు మహాసభలో మహానేత డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
డల్లాస్‌లో జరుగుతున్న నాటా తెలుగు మహాసభలు ముఖ్య అతిథిగా హాజరైన టీటీడీ
చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తెలుగు మహాసభలో వైఎస్సార్‌కు ఘన నివాళి
నార్త్ అమెరికన్ తెలుగు అసొసియేషన్ నాటా మహాసభలు అమెరికా, టెక్సాస్‌లోని
డాలస్ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరుగుతున్నాయి. జూన్ 30 నుంచి జులై 2
వరకు డల్లాస్‌లో జరుగుతున్న నాటా తెలుగు మహాసభల్లో భాగంగా డాక్టర్ వైఎస్సార్
జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ వైవీ
సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసగించారు. పెద్దసంఖ్యలో హాజరైన
అభిమానులు, నేతలు వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ చిరకాలం
అందరి గుండెల్లో నిలిచిపోయారని మహానేతకు ఘన నివాళులర్పించారు. ఆ మహానేత
సేవలను, స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు. జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు
చేశారు. వైఎస్సార్ కొడుకుగా ఏపీ సీఎం జగన్ తన పాలనతో తండ్రిని తలపిస్తున్నారని
కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాటా పాస్ట్ ప్రెసిడెంట్ రాఘవరెడ్డి గోసల,
వైఎస్సార్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆళ్ల రామిరెడ్డి, నాటా సభ్యులు, ఏపీ ప్రభుత్వ
ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్ పండుగాయల, ఏపీ ఎన్ఆర్టీ సభ్యులు, అమెరికా
వైస్సార్సీపీ కన్వీనర్లు, వైస్సార్సీపీ నేతలు, వైఎస్సార్ అభిమానులు
పాల్గొన్నారు.