హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీపై తెలంగాణ
ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. దేశంలో
నిరుద్యోగ రేటు 7.8శాతంగా ఉందని భారాస ఎమ్మెల్సీ కవిత అన్నారు. యువతకు ఏటా 2
కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ ఏమైందంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె
ప్రశ్నించారు. మోస పూరిత హామీతో దేశ యువతను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దగా
చేసిందని విమర్శించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా బీజేపీ , మోడీ పై ఆమె
విమర్శలు గుప్పించారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు
భర్తీ చేస్తారు? కవిత ప్రశ్నించారు. నిజమైన డిగ్రీ సర్టిఫికెట్లు ఉన్న వాళ్లకు
దేశంలో ఉద్యోగాలు రావని, కానీ, డిగ్రీ లేని వాళ్లకు మాత్రం దేశంలోనే అత్యున్నత
ఉద్యోగం ఉందని మోడీని ఉద్దేశించి ఆమె పరోక్షంగా విమర్శలు చేశారు. కాగా ప్రధాని
మోడీ విద్యార్హతలకు సంబంధించి ఎలాంటి డిగ్రీలు చూపించాల్సిన అవసరం లేదని
గుజరాత్ హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై
ప్రతిపక్షాలు తమదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. ఈ తీర్పుతో ప్రధాని నరేంద్ర
మోడీ విద్యార్హత విషయంలో అనుమానం మరింత పెరిగిందని ఢిల్లీ ముఖ్యమంత్రి
అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మోడీ విద్యావంతుడైతే పెద్ద నోట్ల రద్దు వంటి
నిర్ణయాలు తీసుకుని ఉండకపోయేవారని విమర్శించారు.