వెలగపూడి : రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా లంబసింగిలో సుమారు 35
కోట్ల అంచనాతో నిర్మిస్తున్న గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియం
నిర్మాణాన్ని డిశంబరు నెలాఖరు లోగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు
తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ప్రధాన
మంత్రి సలహాదారు అమిత్ ఖేర్ కు వివరించారు. దేశవ్యాప్తంగా గిరిజన స్వాతంత్ర్య
సమరయోధుల మ్యూజియంల నిర్మాణాల ప్రగతిపై మంగళవారం ఢిల్లీ నుండి ప్రధానమంత్రి
సలహాదారు అమిత్ ఖేర్ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో
సమావేశం నిర్వహించారు.ఈ వీడియో సమావేశంలో పాల్గొన్న సిఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ
మాచింగ్ గ్రాంటు 15 కోట్ల రూ.లు సిఎస్ఎస్ స్కీమ్ “Support to TRI”గ్రాంటుతో
పాటు రాష్ట్ర గిరిజన సంక్షేమ బిల్డింగ్ నిధుల కలిపి సుమారు 35 కోట్ల రూ.ల
అంచనాతో లంబసింగిలో చేపట్టిన ట్రైబల్ ఫ్రీడం ఫైటర్ మ్యూజియం నిర్మాణ పనులు
శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు.డిశంబరు నెలాఖరు నాటికి పనులను పూర్తి
చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.ఇప్పటికే ఇంటర్నల్
రోడ్లు,నీటిసరఫరా పనులు ప్రగతిలో ఉన్నాయని సిఎస్.డా.జవహర్ రెడ్డి
వివరించారు.ఈట్రైబల్ ఫ్రీడం ఫైటర్ మ్యూజయం ఏర్పాటు పనులు 4 కాంపొనెంట్లలో
జరుగుతున్నాయని చెప్పారు.ట్రైబల్ హట్ తో కూడిన రెస్టారెంట్,ఎంట్రెన్స్
ప్లాజా,యాంపీ ధియేటర్,మ్యూజియం,హార్డ్ స్కేపింగ్,ల్యాండ్ స్కేపింగ్,కాంపౌండ్
గోడ వంటి పనులు వేగవంతంగా జరుగుతున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
డా.కెఎస్.జవహర్ రెడ్డి ప్రధానమంత్రి సలహాదారు అమిత్ ఖేర్ కు వివరించారు.
ఈవీడియో సమావేశంలో ప్రధానమంత్రి సలహాదారు అమిత్ ఖేర్ మాట్లాడుతూ వివిధ
రాష్ట్రాల్లో మంజూరైన గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియంల నిర్మాణాలను
సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను కోరారు.
ఈవీడియో సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ,గిరిజన సంక్షేమశాఖ
కార్యదర్శి కాంతిలాల్ దండే,గిరిజన సంక్షేమశాఖ సంచాలకులు జె.వెంకట మురళి,అదనపు
సంచాలకులు ఇ.రాంబాబు, ఇఎన్సి ఎస్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.