తిరుమల : డిసెంబర్ 16 మరియు 31వ తేదీల్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం
టిక్కెట్ల ఆన్లైన్ కోటాను డిసెంబర్ 13న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్సైట్లో
విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా టిక్కెట్లను బుక్
చేసుకోవాలని కోరడమైనది.
డిసెంబరు 11న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి ప్రత్యేక అభిషేకం :
తిరుమల శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి
డిసెంబరు 11న కార్తీక మాసం చివరి ఆదివారం సందర్బంగా ప్రత్యేక అభిషేకం
నిర్వహించనున్నారు. పవిత్ర కార్తీక మాసం చివరి ఆదివారం స్వామివారికి
తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా స్వామివారికి
ఉదయం పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళతో తిరుమంజనం నిర్వహించి,
సింధూరంతో విశేష అలంకరణ చేయనున్నారు.