అమరావతి : సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. 6,100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. రెండేళ్ల పాటు గౌరవ వేతనం ఇచ్చేలా అప్రెంటిస్ విధానానికి అంగీకరించింది. పాఠశాల విద్యాశాఖలో ఇతర ఖాళీలను పదోన్నతి, బదిలీల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. అన్ని విశ్వవిద్యాలయాల్లోని బోధనేతర సిబ్బంది ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డిస్కంలకు రూ.1500 కోట్ల రుణం తీసుకునేందుకు బ్యాంకు హామీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం పొందిన సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అటవీశాఖలో 689 పోస్టుల భర్తీ సహా ఏపీ పబ్లిక్ సర్వీసులు నియామక, నియంత్రణ చట్ట సవరణను ఆమోదించింది. న్యాయవాదుల సంక్షేమ చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది అసైన్డ్ భూముల మార్పిడి నిషేధ చట్ట సవరణ బిల్లుకు అంగీకారం
ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెజిస్లేచర్ స్టడీస్ అండ్ ట్రైనింగ్ సంస్థ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ముఖ్యమంత్రి కుటుంబ భద్రతకు ఏర్పాటు చేసే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్లో 25 మంది హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అంగీకారం తెలిపింది. డిజిటల్ ఇన్ఫ్రా కంపెనీని రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.