ఒకటి. ఈ వ్యాధిని ముందే గుర్తించే లక్షణాలు ఇవే..
1)ఒళ్లంతా కాలిపోయేంత జ్వరం కదిలితే ఎముకలు విరిగిపోయేట్టు నొప్పులు వాంతులు
ఇలా ఉంటే అది
డెంగ్యూ జ్వరమేనని గుర్తించాలి.
2) టైగర్ దోమ పగటి పూట కుట్టినప్పుడు మాత్రమే డెంగీ జ్వరం వస్తుంది. ఈ దోమ
కుట్టిన వారం రోజులకు హఠాత్తుగా 104 డిగ్రీల జ్వరం ఉంటుంది.
3) చలి, ఒళ్లు నొప్పులు, కంటి వెనక భాగంలో నొప్పి, నీరసంతో పాటు చర్మంపై దురద
కూడా వస్తుంది.
4) రెండో దశలో జ్వరం తగ్గిన తర్వాత రెండు రోజులకు రక్తంలో తెల్లకణాలు పెరిగి,
ప్లేట్ లెట్స్ తగ్గిపోతాయి అప్పుడే అప్రమత్తంగా ఉండాలి.
5) ఇది కూడా వైరల్ జ్వరం లాంటిదే. వంద మందిలో ఐదారుగురికి మాత్రమే సీరియస్ గా
మారుతుంది. ఒకసారి డెంగీ వచ్చిన వ్యక్తికి మళ్లీ డెంగీ వస్తే మాత్రం తీవ్రత
అధికంగా ఉంటుంది.
6) రక్తంలో ప్లేట్ లెట్స్ కౌంటు 10-20 వేల కంటే తక్కువకు పడిపోయినప్పుడే
వైద్యులు వాటిని ఎక్కిస్తారు.
7) డెంగీ జ్వరం వచ్చినపుడు దాని తీవ్రత ఆధారంగా వైద్యుల సూచనతో మందులను
వాడాలి. కానీ, సొంతంగా మందులు వేసుకోవద్దు.
8) ఈ సమయంలో నొప్పులు ఉన్నాయని పెయిన్ కిల్లర్ మందులు వాడకూడదు. దీనితో బీపీ
లెవెల్స్ పడిపోతాయి. కొన్నిసార్లు రక్తస్రావం కూడా కావొచ్చు.