మంగళవారం ధ్వజారోహణం
ఏడున గజ వాహనోత్సవం
8న విశేష శ్రీ శ్రీనివాస కళ్యాణం
పాల్గొననున్న మహాక్షేత్రం వ్యవస్థాపక ధర్మకర్తలు పీ వీ కృష్ణారెడ్డి,
సుధారెడ్డి
విజయవాడ : కృష్ణా జిల్లాలోని డోకిపర్రు మహాక్షేత్ర సప్తమ వార్షిక సాలకట్ల
బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి జరుగుతాయి. సోమవారం అంకురారోపణం, మంగళవారం
ధ్వజారోహణం, ఏడున గజ వాహనోత్సవం, 8న విశేష శ్రీ శ్రీనివాస కళ్యాణం
జరగనున్నాయి. మహాక్షేత్రం వ్యవస్థాపక ధర్మకర్తలు పీ వీ కృష్ణారెడ్డి,
సుధారెడ్డి పాల్గొంటారు. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం
డోకిపర్రుమహాక్షేత్రంలోని శ్రీ భూసమేత శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి
సప్తమ వార్షిక బ్రసాలకట్ల హ్మోత్సవాలు ఈ నెల ఐదు (సోమవారం) నుంచి ఎనిమిదో
తేదీ (గురువారం) వరకు జరగనున్నాయి. దివ్యశ్రీ వైఖానస భగవత్చా
శాస్త్రమార్గానుసారంగాశుభకృత్ నామసంవత్సర మార్గశిర శుద్ధ ద్వాదశి సోమవారం
నుంచి పూర్ణిమ గురువారం వరకు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని వేదపండితులు
నిర్ణయించారు. అత్యంత వైభవోపేతంగా జరిగే ఈబ్రహ్మోత్సవాల్లో పాల్గొని,
శ్రీవేంకటేశ్వరుని దర్శించుకొని తరించాల్సిందిగాభక్తులను ఆలయ వ్యవస్థాపక
ధర్మకర్తలు పీ వీ కృష్ణారెడ్డి, సుధారెడ్డి దంపతులు కోరారు. ఈనాలుగు రోజులపాటు
ఆలయాన్ని సందర్శించి ఏడుకొండల వేంకటేశ్వరుని దర్శించుకునే భక్తులకుఎలాంటి
ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహకులు పీ వీరారెడ్డి,
విజయలక్ష్మి, కొమ్మారెడ్డి బాపిరెడ్డి,విజయభాస్కరమ్మ దంపతులు తెలిపారు.
డోకిపర్రు మహాక్షేత్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామిఆలయ నిర్మాణానికి
అంకురార్పణ 2013లో జరిగింది.2015 మే 30 న మహాక్షేత్రం లో శ్రీవెంకటేశ్వర
స్వామి వారిని ప్రతిష్టించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలు,
ప్రతిష్టాసహిత అవతారోత్సవాలు జరుగుతున్నాయి. వరలక్ష్మి వ్రతం, కార్తీక
దీపోత్సవం, ప్రతిఏడాది జనవరిమాసంలో గోదా కళ్యాణం, పండుగలు, ఇతరముఖ్యమైన
రోజుల్లో ప్రత్యేక పూజలుమహాక్షేత్రంలో ఆలయ ధర్మకర్తలు
నిర్వహిస్తున్నారు.బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మహాక్షేత్రంలో పాటు పరిసర
ప్రాంతాలను రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో అలంకరించారు. ఈ నాలుగు రోజులపాటు
ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదికపై వివిధ నాట్య బృందాలు సాంస్కృతిక ప్రదర్శనలు
ఇవ్వనున్నాయి. అదే సమయంలోమహాక్షేత్ర ప్రాధాన్యత, శ్రీ వేంకటేశ్వరుని మహిమలను
ఆధ్యాత్మికవేత్తలు వివరించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే
పూజలకు ప్రత్యేకంగా వేదికలు, వాహనాలను ధర్మకర్తలు సిద్ధం చేశారు. ఆలయానికి
వచ్చే భక్తుల రద్దీని నియంత్రించటంతో పాటు, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా
ఉండేందుకు క్యూ లైన్ లను ఏర్పాటు చేశారు. వీరికి శ్రీ వారి ప్రసాదం
అందించేందుకు కూడాఆలయ ధర్మకర్తలు కృష్ణారెడ్డి దంపతులుఏర్పాట్లు చేశారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వేంకటేశ్వరుని డోకిపర్రు గ్రామవీధుల్లో ప్రత్యేక
వాహనాల్లోఊరేగించనున్నారు. తిరుమలలో శ్రీవేంకటేశ్వరునికి ఏ విధంగానైతే
పూజాదికాలు నిర్వహిస్తారో డోకిపర్రు మహాక్షేత్రం లోఅదేమాదిరిగా ఆలయ ధర్మకర్తలు
పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం ఆరుగంటలనుంచి మధ్యాహ్నం ఒంటి గంట
వరకు, సాయంత్రం ఐదున్నర నుంచి తొమ్మిది గంటల వరకుమహాక్షేత్రంలో శ్రీ
వేంకటేశ్వరుని భక్తులు దర్శించుకుని తరించవచ్చని ధర్మకర్తలు తెలిపారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా
డోకిపర్రు మహాక్షేత్రం బ్రహ్మోత్సవాల్లోభాగంగా సోమవారం అంకురారోపణం,
తిరుచ్చి(పల్లకీ)సేవలు జరుగుతాయి. రెండో రోజున మంగళవారం నాడు ధ్వజారోహణ
ఉత్సవం నిర్వహిస్తారు. అదేరోజున శ్రీవారికి సూర్యప్రభ వాహనం, శేషవాహనం, హంస
వాహనసేవలు జరుగుతాయి.డిసెంబర్ ఏడున బుధవారం గజవాహనోత్సవం, రధోత్సవం,
గరుడోత్సవం, చివరి రోజైనడిసెంబర్ ఎనిమిదో తేదీన చూర్ణోత్సవం, వసంతోత్సవం,
చక్రస్నానం, విశేష శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవం, ధ్వజఅవరోహణ, చంద్రప్రభ
వాహనోత్సవం జరుగుతాయని మహాక్షేత్రం వ్యవస్థాపక ధర్మకర్తలుకృష్ణారెడ్డి,
సుధారెడ్డి దంపతులు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ ఏడాది నూతన
పుష్కరిణిని ధర్మకర్తలు ప్రారంభించనున్నారు. ఈ నెల 10న ఆలయ వ్యవస్థాపక
ధర్మకర్త సిధారెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని డోకిపర్రు
మహాక్షేత్రంలో సహస్ర కలశాభిషేకం నిర్వహించనున్నారు.