ధ్వజస్తంభం ప్రతిష్ఠ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రత్యేక పూజలు
ఆర్థిక మంత్రి బుగ్గన చొరవతో రూ.4 కోట్లతో వేగంగా ఆలయ అభివృద్ధి
నంద్యాల : వందల ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాచీణ ఆలయమైన రంగాపురం మద్దిలేటి
నరసింహస్వామి క్షేత్రాన్ని పున:నిర్మించే అవకాశం తనకు రావడం అదృష్టమని ఆర్థిక
శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. బేతంచెర్లలోని రంగాపురంలో రూ.4
కోట్లతో కళాఖండంలా పూర్తై గురువారం నిర్వహిస్తున్న మద్దిలేటి స్వామి వారి పున:
ప్రతిష్ట వేడకులకు ఆయన హాజరయ్యారు. ఎంతో చారిత్రక నేపథ్యం, ఎన్నో పురాణ గాథలతో
ముడిపడి ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరంగా తిరిగి నిర్మించిన గుడిని పరిశీలిస్తూ
లక్ష్మీ మద్దిలేటి నృసింహ స్వామిని మంత్రి బుగ్గన దర్శించుకున్నారు. ఉమ్మడి
కర్నూలు జిల్లా ప్రజలు ఎంతో భక్తితో కొలిచే భక్తుల కొంగుబంగారమైన మద్దిలేటి
ఆలయం పున:నిర్మించే అరుదైన అవకాశం రావడాన్ని స్వామి కటాక్షంగా భావించి ఎంతో
దీక్షగా పూర్తిచేసినట్లు మంత్రి పేర్కొన్నారు. అంతకు ముందు ఆలయ ధర్మకర్త మండలి
ఆధ్వర్యంలో అర్చకులు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కి పూర్ణకుంభంతో
ఘన స్వాగతం పలికారు. పూర్ణాహుతి , కలశ అవిష్కరణ, ధ్వజ స్తంభం ప్రతిష్ఠ అనంతరం
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్వామి వారికి ప్రత్యేక పూజలు
నిర్వహించారు. అనంతరం కర్నూలు పట్టణంలోని విశ్రాంత రహదారులు, భవనాల శాఖ
సీనియర్ ఇంజినీర్ జయరామిరెడ్డి ఇంటికి మంత్రి బుగ్గన స్వయంగా వెళ్లి
ఆత్మీయంగా సమావేశమయ్యారు. మద్దిలేటి స్వామి ప్రతిష్ఠ ఉత్సవాలకు మద్దిలేటి
స్వామి ఆలయ ఛైర్మన్ భువనగిరి సీతారామ చంద్రుడు, కర్నూలు జెడ్పీ ఛైర్మన్
ఎర్రబోతుల పాపిరెడ్డి, బేతంచెర్ల ఎంపీపీ బుగ్గన నాగభూషణ్ రెడ్డి, బేతంచెర్ల
జెడ్పీటీసీ శివలక్ష్మి, ఆర్ ఎస్ రంగాపురం సర్పంచ్ గుమ్మగాళ్ల రాజు, ఆర్డీవో
వెంకట రెడ్డి,ఆలయ ధర్మకర్త మండలి,ఈవో దేవిరెడ్డి పాండురంగారెడ్డి తదితరులు
హాజరయ్యారు.