డోన్ నియోజకవర్గానికి ఏ లోటు లేకుండా చేయాలనేది నా తపన
మంచి పనులు చేస్తుంటే..మళ్లా నువ్వే వస్తావంటూ మంత్రిని ఆశీర్వదించిన అవ్వ
బేతంచెర్ల మండలం ఆర్.బుక్కాపురంలో కొత్త బీటీ రోడ్డును ప్రారంభించిన బుగ్గన
“గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి
శిక్షణ అనంతరం ఎంపికైన 2వ బ్యాచ్ పైలట్ లకు నియామకపత్రాల అందజేత
మంత్రి సమక్షంలో డోన్ పట్టణ మార్కెట్ యార్డు కొత్త కమిటీ ప్రమాణస్వీకారం
పార్టీ కోసం పని చేసిన ఏ ఒక్కరినీ వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ మర్చిపోదు
డోన్ : తన సొంత నియోజకవర్గం డోన్ ప్రజల అభిమానానికి కొలమనం లేదని ఆర్థిక శాఖ
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు.2014. 2019 ఎన్నికలలో వరుసగా 2
సార్లు విజయం అందించడమే అందుకు నిదర్శనమన్నారు. డోన్ ప్రజలకు ఏ లోటు లేకుండా
సమగ్రాభివృద్ధితో తొణికిసలాడేలా చేయాలనేదే తన తపనగా మంత్రి బుగ్గన
పేర్కొన్నారు. తనకు ప్రజలిచ్చిన అవకాశం వల్లే డోన్ లో వ్యవసాయ, నీటిపారుదల,
విద్య,వైద్య తదితర రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి స్పష్టం
చేశారు. అన్ని ప్రాంతాలు, వర్గాలు బాగుండాలి, ప్రతి ఒక్కరూ బాగుపడాలనేదే సీఎం
జగన్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన అన్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో
కీలకంగా పని చేస్తున్న చాలా మంది శ్రమను గుర్తించి వారికి పార్టీ తగిన స్థానం
కల్పించిందన్నారు. ప్రతి ఒక్కరికీ సముచిత న్యాయం చేయడమే నిత్యం ముఖ్యమంత్రి
మనసులో మెదిలే విషయమన్నారు.
బేతంచెర్లలో సచివాలయం, రోడ్డును ప్రారంభించిన మంత్రి బుగ్గన
బేతంచెర్ల పట్టణంలో కొత్తగా కట్టించిన 3వ సచివాలయం భవనాన్ని ఆర్థిక శాఖ
మంత్రి బుగ్గన ప్రారంభించారు. బేతంచెర్ల మండలం ఆర్.బుక్కాపురంలో కొత్త బీటీ
రోడ్డును మంత్రి ప్రారంభించారు.
మంచి పనులు చేస్తుండ్..మళ్లా నువ్వే వస్తావంటూ మంత్రిని ఆశీర్వదించిన అవ్వ
డోన్ పట్టణం 17వ వార్డు లో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో పాల్గొన్న
ఆర్థిక శాఖ మంత్రి ప్రతి గడపకు ప్రభుత్వం ద్వారా అందిన లబ్ధిని వివరిస్తూ
అందుకు సంబంధించిన పత్రాలను ఆ కుటుంబాలకు అందజేశారు. ప్రభుత్వ పథకాల లబ్ధి
గురించి వివరిస్తున్న సందర్భంలో మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డిని
మాసూంబీ అనే 75 ఏళ్ల అవ్వ ఆప్యాయంగా పలకరించింది. వృద్ధులకు ప్రభుత్వం
అందిస్తున్న సంక్షేమం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ మంత్రి బుగ్గనని ప్రేమగా
హత్తుకుంది. “నాయనా! నీకు తిరుగులేదు నాయనా! చాలా మంచి పనులు చేస్తుండావ్
..మళ్లా తప్పక నువ్వే వస్తావ్ నాయనా..” అంటూ మంత్రి బుగ్గనను ఆ అవ్వ
ఆశీర్వదించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మీట్ కార్పొరేషన్ ఛైర్మన్
శ్రీరాములు, డోన్ మున్సిపల్ ఛైర్మన్ సప్తశైల రాజేష్,వైస్ ఛైర్మన్ జాకీర్, బేతం
చెర్ల ఎంపీపీ బుగ్గన నాగభూషణ్ రెడ్డి, బేతంచెర్ల జెడ్ పీటీసీ యం.శివలక్ష్మి,
ఆర్.కొత్తపల్లె ఎంపీటీసీ కె.మునీశ్వరరెడ్డి, ఆర్. బుక్కాపురం గ్రామ సర్పంచ్
తలారీ నాగరాజు, నియోజకవర్గ నాయకులు, అధికారులు, ప్రజలు హాజరయ్యారు.