ఇచ్చిన మాట ప్రకారం మేలు చేస్తున్న సీఎం
మంత్రి ఉషశ్రీ చరణ్ వెల్లడి
తన పాలనలో మహిళలను మోసం చేసిన బాబు
రుణాలు మాఫీ చేయకుండా డ్వాక్రా మహిళలకు దగా
చివరకు పావలా వడ్డీ రుణాలకు కూడా మంగళం
గుర్తు చేసిన మంత్రి ఉషశ్రీ చరణ్
బాబుకు, పవన్‌కు జెండా, ఎజెండా లేదు
అందుకే ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు
అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నారు
చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్తు లేదు
వచ్చే ఎన్నికల్లో ఆయనకు శాశ్వత గుడ్‌బై
మంత్రి ఉషశ్రీ చరణ్ స్పష్టీకరణ
గుంటూరు : డ్వాక్రా మహిళలను చంద్రబాబు వంచించారని, మహిళల సాధికారతే ధ్యేయంగా
సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పని చేస్తున్నారని మంత్రి ఉషశ్రీ చరణ్
అన్నారు. వారికి అన్ని రంగాల్లో పూర్తి ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా పదవుల కేటాయించారని, మహిళల రక్షణ కోసం దిశ చట్టం,
దిశ యాప్ తెచ్చారని ప్రెస్మీట్లో మంత్రి ఉషశ్రీ చరణ్ మాట్లాడారు.
చంద్రబాబుకు ఈర్ష్య
ఇటీవల విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీ తన పర్యటనలో సీఎం జగన్‌కు ఎంత
ప్రాధాన్యం ఇచ్చారనేది ప్రజలంతా చూశారు. రాష్ట్ర ప్రజలందరికీ సీఎం పాలనపై
ఎంతో విశ్వాసం ఉంది. అందుకే ఆరోజు దాదాపు 3 లక్షల మంది ప్రధాని సభకు తరలి
వచ్చారు. దీంతో చంద్రబాబులో ఈర్ష్య మొదలైంది. అందుకే కర్నూలు జిల్లా పర్యటనలో
పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. డ్వాక్రా సంఘాలు తానే ఏర్పాటు చేసినట్లు
చెప్పుకుంటున్నారు. నిజానికి చంద్రబాబు తన దత్తపుత్రుడి ద్వారా రాష్ట్ర
ప్రభుత్వంపై ఫిర్యాదు చేయాలని చూస్తే, లాభం లేకపోయింది. ఆ తర్వాత తన పార్టీ
నుంచి బీజేపీలోకి పంపించిన ఎంపీల ద్వారా ప్రయత్నించినా చంద్రబాబు అనుకున్నది
జరగలేదు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. దేశంలో డ్వాక్రా సంఘాలు 1982లో
ఏర్పాటయ్యాయి. నిజానికి అప్పటికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించలేదు. మరి
అలాంటప్పుడు చంద్రబాబు తానే డ్వాక్రా సం«ఘాలు ఏర్పాటు చేసినట్లు ఎలా
చెప్పుకుంటారు? అంటే చంద్రబాబు ఏ విధంగా అబద్ధాలు చెబుతున్నాడనేది అందరూ అర్ధం
చేసుకోవాలి.
డ్వాక్రా మహిళలను మోసం చేసిన బాబు
40 ఏళ్ల రాజకీయ జీవితం, 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు ఇంత పచ్చిగా
అబద్ధాలు చెబుతుంటే, ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు.
రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలు ఆనాడు మహానేత వైయస్సార్ హయాంలో మరింత యాక్టివ్
అయ్యాయి. డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీకే రుణాలు వచ్చేలా ఆయన చూశారు. 2014
ఎన్నికల్లో డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబు, అధికారం
చేపట్టిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోలేదు. అంతే కాకుండా 2016 నుంచి డ్వాక్రా
సంఘాలకు పావలావడ్డీ రుణాలు కూడా బంద్ అయ్యాయి. ఆ విధంగా డ్వాక్రా మహిళలను
కూడా చంద్రబాబు మోసం చేశారు.
మాట నిలబెట్టుకున్న సీఎం
తన సుదీర్ఘ పాదయాత్రలో డ్వాక్రా అక్కచెల్లెమ్మల ఇబ్బందులు చూసిన సీఎం వైయస్
జగన్ 2019 ఎన్నికల నాటికి వారికి ఉన్న రుణాలన్నీ చెల్లిస్తానని చెప్పారు. ఆయన
నాలుగు విడతల్లో వారికి ఆ మొత్తం ఇస్తున్నారు. రాష్ట్రంలో 7.97 లక్షల పొదుపు
సంఘాల్లో 76 లక్షల అక్క చెల్లెమ్మలకు దాదాపు రూ.12,750 కోట్లు ఇవ్వడం
జరిగింది. సీఎం జగన్, అక్కచెల్లెమ్మలకు అన్నింటా ప్రాధాన్యం ఇస్తున్నారు.
అందులో భాగంగానే 31 లక్షల ఇళ్ల పట్టాలు వారి పేరుతో రిజిస్ట్రేషన్ చేసి
ఇవ్వడంతో పాటు, రెండు విడతల్లో 21 లక్షల ఇళ్లు కూడా నిర్మించి ఇవ్వడం
జరుగుతుంది.
జనసేన అనవసర హంగామా
దీంతో ఏం చేయాలో అర్ధం కాని చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు ప్రభుత్వంపై ఏదో ఒక
విధంగా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణంపై సోషల్ ఆడిటింగ్
అంటూ, జగనన్న కాలనీలకు వెళ్లిన జనసేన నాయకులను, ఎక్కడిక్కకడ లబ్ధిదారులు
తిప్పి కొట్టారు. వారికి గుణపాఠం చెప్పారు.
మహిళలు–పదవులు:
రాష్ట్రంలో మహిళలు రాజకీయంగా ఎదిగితేనే వారి సాధికారత సాధ్యమని నమ్మిన సీఎం
జగన్, నామినేటెడ్ పదవుల్లో వారికి 50 శాతం ఇచ్చారు. ఇస్తున్నారు. జడ్పీ
ఛైర్మన్ పదవులు 13 ఉంటే వాటిలో 7, వైస్ ఛైర్పర్సన్ పోస్టులు 26 ఉంటే
వాటిలో 15 పదవులు,12 మేయర్, 14 డిప్యూటీ మేయర్ పదవుల్లో 18, మున్సిపాలిటీ
పదవుల్లో దాదాపు 53 శాతం, సర్పంచ్ పదవుల్లో 57 శాతం, ఎంపీటీసీ పదవుల్లో 54
శాతం, ఎంపీపీ పదవుల్లో దాదాపు 53 శాతం, జడ్పీటీసీ పదవుల్లో 53 శాతంతో పాటు,
చివరకు వలంటీర్లలో కూడా 53 శాతం మహిళలకు ఇచ్చారు. ఇది ఎంతో గర్వకారణం.
ఆకాశంలో సగం…. అవకాశంలో సగం
ఆకాశంలో సగం. అవకాశంలో సగం అని అంటారు. దాన్ని మన రాష్ట్రంలో నూటికి నూరు శాతం
అమలు చేస్తున్నారు. మండలి వైస్ ఛైర్‌పర్సన్‌గా మైనారిటీ మహిళ ఉన్నారు. అదే
విధంగా తొలి క్యాబినెట్లో డిప్యూటీ సీఎంతో పాటు, హోం మంత్రులుగా మహిళలే
వ్యవహరించారు. ఇప్పుడు కూడా హోం మంత్రిగా మహిళ ఉన్నారు. అదే విధంగా సీఎస్‌గా
కూడా ఒక మహిళనే పని చేశారు. ఆ విధంగా ఇచ్చిన ప్రతి మాట, హామీని జగన్‌గారు
నిలుపుకున్నారు.
దిశ–ఒక స్థైర్యం
ఇక మహిళల రక్షణ కోసం దిశ చట్టం. దిశ యాప్. ఈ తరహాలో దేశంలో ఎక్కడా లేదు.
రాష్ట్రంలో దాదాపు 1.30 కోట్ల మహిళలు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోగా, దాదాపు 5
వేల మంది మహిళలను ఆపద నుంచి కాపాడడం జరిగింది. ఆ విధంగా మహిళల్లో ఒక ధైర్యం,
ఆత్మ విశ్వాసాన్ని జగన్ కల్పించారు. ఇక చంద్రబాబు పాలనలో చూస్తే కాల్‌మనీ
సెక్స్ రాకెట్. రిషితేశ్వరి ఆత్మహత్య, తహసీల్దార్ వనజాక్షికి జరిగిన
అవమానం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఆ విధంగా జగన్, చంద్రబాబు పాలనకు మధ్య
ఎంతో తేడా. దగా, వంచనకు మారుపేరు చంద్రబాబు కాగా విశ్వసనీయతకు మారుపేరు జగన్
అన్నారు.
బాబుకు శాశ్వతంగా గుడ్‌బై
చంద్రబాబుకు రాజకీయంగా భవిష్యత్తు లేదు. అందుకే ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుని,
ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. రాజకీయాల్లో 40 ఏళ్ల జీవితం అని
చెప్పుకునే చంద్రబాబు, ఇప్పుడు మరింత దిగజారి పోయి, వచ్చే ఎన్నికలు తనకు చివరి
ఎన్నికలని, అందుకే గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్తానంటూ వేడుకుంటున్నారు. జగన్
అన్ని వర్గాల వారికి ఎంతో మేలు చేస్తూ, అందరి మన్ననలు పొందుతుండడంతో,
చంద్రబాబుకు దిక్కు తోచడం లేదు. అందుకే బాదుడే బాదుడు వంటి ఏవో కార్యక్రమాలు
పెట్టుకుని తిరుగుతున్నాడు. 2019లో చంద్రబాబుకు ప్రజలు బైబై చెప్పారు. వచ్చే
ఎన్నికల్లో శాశ్వతంగా గుడ్‌బై చెబుతారు.
అసూయకు మందు లేదు
రాజధాని మొత్తం అమరావతిలోనే ఉండాలని కోరుతున్న చంద్రబాబు, రాయలసీమలో
పర్యటిస్తున్నారు. అందుకే అక్కడి వారు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తన సభకు
ప్రజలు వస్తున్నారు కాబట్టే, ఈ విధంగా నిరసన చేçస్తున్నారని చంద్రబాబు
ఆరోపించడం హాస్యాస్పదం. గడప గడపకూ కార్యక్రమంలో ప్రజలు మమ్మల్ని ఎంతో
ఆదరిస్తున్నారు. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. అందుకే దిక్కుతోచక
దుష్ప్రచారం చేస్తున్నారు.
అసూయకు, కడుపు మంటకు మందు లేదు. సీఎం వైయస్ జగన్‌కు అంతులేని ప్రజాదరణ
వస్తోంది. అందుకే ఫ్రస్టేషన్లో ఉన్న చంద్రబాబు, ఏదేదో మాట్లాడుతున్నారు.
అసూయతో ఆయన రగిలి పోతున్నారు. అధికారులపైనా నిందలు మోపుతున్నారు.
జెండా, ఎజెండా రెండూ లేవు
చంద్రబాబుకు, పవన్‌కళ్యాణ్‌కు జెండా, ఎజెండా రెండూ లేవు. అందుకే
ప్రభుత్వంపైనా, జగన్‌గారిపైనా పిచ్చి విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు.
చంద్రబాబు తన హయాంలో అనంతపురం జిల్లాలో ఎక్కువగా ఉన్న కురుబ కులస్తులను ఏనాడూ
పట్టించుకోలేదు. అదే సీఎం వారికి రాజకీయాల్లో కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చారు.
ఇది వాస్తవం అని అన్నారు.