న్యూఢిల్లీ : జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు.
ఆదివారం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వెళ్లిన పవన్ కళ్యాణ్ సోమవారం హస్తినకు
చేరుకున్నారు. పవన్‌తో పాటు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల
మనోహర్ కూడా ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బీజేపీ కి చెందిన పలువురు
ముఖ్యనేతలు, కేంద్రమంత్రులతో పవన్, మనోహర్ భేటీ కానున్నారు. ఏపీలో ఇటీవల
జరుగుతున్న పరిణామాలు, తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణ తదితర
అంశాలపై బీజేపీ పెద్దలతో పవన్ చర్చిచే అవకాశముంది. ఇటీవల రాష్ట్ర బీజేపీ
నేతలు, జనసేన మధ్య దూరం పెరిగిందనే ఊహాగానాల నేపథ్యంలో జనసేనాని ఢిల్లీ
పర్యటనపై ఆసక్తి నెలకొంది.