విజయవాడ : కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి జాతిపిత మహాత్మాగాంధీ
పేరు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టాలని, అలాగే పార్లమెంట్
భవన్ ప్రాంగణంలో వారిద్దరి భారీ కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయాలని నేటి
గాంధీ ఆర్ ఆర్ గాంధీ నగరాజన్ డిమాండ్ చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ హత్యకు
గురైన 1948 జనవరి 30 తేదీని గుర్తు చేస్తూ..ప్రతినెలా 30 తేదీన కళ్ళకు గంతలు
కట్టుకొని ఉపవాస దీక్షలు చేస్తున్న గాంధిదేశం సోషల్ వేల్ఫర్ ట్రస్టు
వ్యవస్థాపక అధ్యక్షులు నేటి గాంధీ ఆర్ ఆర్ గాంధీ నగరాజన్ బుధవారం రైలు
ప్రయాణంలో కూడా తన దీక్షలు చేపట్టారు.ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోరుతూ
ఢిల్లీ పార్లమెంట్ ఆవరణలో అన్ని రాష్ట్రాల ఎమ్ పి లకు వినతిపత్రాలు
అందించడానికి,విభక్త ఆంధ్రప్రదేశ్ కి జరుగుతున్న అన్యాయాన్ని వివరించి
రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై అందరు ఎమ్ పి ల మద్దతు ఇవ్వాలని కొరడానికి
డిల్లీ వెళ్లిన నేటి గాంధీ తిరుగు ప్రయాణంలో బుధవారం తన దీక్షలు చేపట్టారు. ఈ
సందర్భంగా కళ్ళకు గంతలు కట్టుకొని ఉపవాస దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ గాంధీ జయంతి అందరికీ గుర్తుంటుందని గాంధీ హత్యకు గురైన రోజుకుడా
ఆయనకు నివాళులు అర్పించాలనే ధ్యేయంగాతో ప్రతినెలా 30 తేదీన ఇలాంటి దీక్షలు
చేపడుతున్నట్టు చెప్పారు. గాంధీని హత్య చేసిన వారి వారసులు నేడు విదేశాల్లో
ఉన్నత శిఖరాల్లో ఉన్నారని,విదేశాల్లో దర్జాగా బతుకుతున్నారని కానీ మన దేశంలో
గాంధీ గారి వర్ధంతి ని సైతం మర్చిపోతే ఎలా అంటూ అందుకే ప్రతినెలా 30 తేదీన ఈ
కార్యక్రమం చేపడుతున్నామని ఆయన తెలిపారు.