విజయవాడ : ఏపీ ముఖ్యమంత్రి జగన్ గురువారం రాత్రి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు.
ఏపీ అసెంబ్లీలో ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాత సాయంత్రం
ఆయన ఢిల్లీకి వెళ్లారు. శుక్రవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం
మంత్రి అమిత్ షాలతో జగన్ భేటీ కానున్నారు. జగన్ ఉన్నట్టుండి హస్తినకు
బయల్దేరనుండటం ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి
వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు విశాఖ నుంచి పాలన కొనసాగించే అంశం గురించి
ఢిల్లీ పెద్దలకు జగన్ సమాచారం ఇవ్వనున్నారని అంటున్నారు. రాష్ట్రానికి కేంద్రం
నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిలు, రాష్ట్ర సమస్యలను మోడీ, అమిత్ షాల వద్ద
ప్రస్తావించే అవకాశం ఉంది. కొందరు కేంద్ర మంత్రులతో కూడా జగన్ సమావేశమయ్యే
అవకాశం ఉన్నట్టు సమాచారం.