ఢిల్లీ : మద్యం కుంభకోణం వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న మరో ఇద్దరిని అరెస్టు చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పెన్నాక శరత్ చంద్రారెడ్డి, మరో మద్యం వ్యాపారి వినయ్‌బాబును అరెస్టు చేసినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఇద్దరికి రూ.కోట్ల విలువైన మద్యం వ్యాపారం ఉందని ఈడీ పేర్కొంది. ఢిల్లీ మద్యం పాలసీకి అనుగుణంగా ఈఎండీలు చెల్లించినట్లు శరత్‌పై అభియోగాలున్నాయి. శరత్ చంద్రారెడ్డి అరబిందో గ్రూపులోని 12 కంపెనీలకు, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సంస్థలోనూ డైరెక్టర్‌గా ఉన్నారు. మద్యం కుంభకోణం కేసులో ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్‌ను ఎఫ్ఆర్ఐలో గతంలో సీబీఐ ఎఫ్ఆర్ఐలో చేర్చింది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. దీనిలో భాగంగా సెప్టెంబర్ 21, 22, 23 తేదీల్లో ఢిల్లీలో శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారుల ప్రశ్నించారు. దిల్లీ లిక్కర్ పాలసీకి అనుగుణంగా ఈఎండీలను శరత్ చెల్లించారు. ఈ క్రమంలోనే ఆయన్ను విచారించిన ఈడీ గురువారం ఢిల్లీలో అరెస్ట్ చేసింది. ఈ కేసులోనే గతంలో హైదరాబాద్‌కు చెందిన రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్‌ను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.