కడప : తండ్రి మాట కోసం నిలబడిన వ్యక్తి వైఎస్ షర్మిల అని కేవీపీ రామచంద్రరావు అన్నారు. వైఎస్ కుటుంబంతో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని, వైఎస్సార్, షర్మిళ ఒకే బాటలో నడవడం ఆనందదాయకమని చెప్పారు. శనివారం కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ విభేదాలు ఉన్నా సాన్నిహిత్యం వీడలేదన్నారు. వైఎస్ షర్మిల తనకు మేన కోడలు మాత్రమే కాదని, కూతురుతో సమానమన్నారు. కాంగ్రెస్ పార్టీకి దిక్సూచిగా షర్మిల నిలబడి దేశంలో అగ్రగామిగా నిలబెట్టిన రాజశేఖర్ రెడ్డి బిడ్డని అందరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజశేఖర్రెడ్డి అభిమానులు షర్మిలకు అండ ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు పూర్వ వైభవం షర్మిలతో సాధ్యం అవుతుందని కేవీపీ రామచంద్రరావు తెలిపారు.