నీడై..భవితకు తోడై నిలిచిన ఎన్టీఆర్ స్కూల్
కుప్పం : యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ని కలిసిన ఈ యువకుడి పేరు
నవీన్ సొంతూరు శాంతిపురం. చంద్రబాబు అన్నా, తెలుగు దేశం పార్టీ అన్నా
వల్లమాలిన అభిమానం చూపే నవీన్ తండ్రి పేరు కూడా చంద్రబాబే. హఠాత్తుగా
తండ్రి చనిపోవడంతో నవీన్ జీవితం అగమ్యగోచరమైంది. అప్పుడే కారుచీకట్లో
కాంతిపుంజంలా తెలుగుదేశం పార్టీ కనిపించింది. నవీన్ ఎన్టీఆర్ స్కూలులో
ఉచితంగా విద్యాభ్యాసం పూర్తిచేసే అవకాశం చంద్రబాబు కల్పించారు. 2010 నుండి
2015 వరకూ ఎన్టీఆర్ స్కూలులో చదువుకున్న నవీన్, ఆ తరువాత బీటెక్ పూర్తి
చేసేందుకు చంద్రబాబు సాయమయ్యారు. ఇప్పుడు నవీన్ బెంగళూరులో మంచి ఉద్యోగం
చేస్తున్నాడు. తనకు తండ్రిలా ఆదరించి చదివించిన చంద్రబాబు తనయుడు
లోకేష్ ని కలిసి కృతజ్ఞతలు తెలియజేశాడు నవీన్. నా చదువు, ఉద్యోగం,
భవిష్యత్తు అంతా తెలుగుదేశం పార్టీ ఇచ్చిందేనంటూ యువగళం వినిపించాడు.