బాలీవుడ్లోని క్యూట్ కపుల్స్లో ఆలియా భట్, రణ్బీర్ కపూర్ జంట ఒకటి. ఈ ఏడాది వ్యక్తిగతంగా, వృత్తిగతంగా ఈ జంటకి చాలా మంచి జరిగింది. తాజాగా ఈ జంటకి మరోసారి అదృష్టం కలిసొచ్చింది. ఇటీవలే ఆలియాకి సీమంతం జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ భామ దాదాపు బయటికి రావడమే మానేసిందని చెప్పాలి. కాగా.. గత కొన్ని రోజులుగా ఆలియా డెలివరీ సమయం దగ్గర పడిందని, అందుకే హాస్పిటల్లో ఉందని వార్తలు వినిపించాయి. కాగా.. ఈ రోజు (నవంబర్ 6న) ఆలియాకి ప్రసవం అయ్యింది. సరిగ్గా 12.05 గంటలకి పండంటి ఆడబిడ్డకి ఈ బ్యూటీ జన్మనిచ్చింది. దాంతో భట్, కపూర్ కుటుంబాల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వారి మొదటి బిడ్డని చూసి ఈ జంట కూడా చాలా ఆనందంగా ఉందని తెలుస్తోంది.