ఎయిమ్స్‌కు తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఆత్మకూరు రిజర్వాయర్ నుంచి రూ.7.74 కోట్ల ఖర్చుతో పైపు లైను పనులు మొదలుపెట్టామని చెప్పారు. సోమవారం నుంచే ఈ పనులు ప్రారంభమయ్యాయన్నారు. తాత్కాలికంగా ఈ సమస్య లేకుండా చేసేందుకు మంగళగిరి- తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రోజుకు 3.5లక్షల లీటర్ల నీటిని ఉచితంగా సరఫరా చేస్తున్నామని చెప్పారు. మరో లక్ష లీటర్ల నీటిని అత్యవసర సమయాల్లో వాడుకునేందుకు వీలుగా ప్రతి రోజూ అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. అవసరమైన ప్రతిసారీ ఈ నీటిని కూడా ఎయిమ్స్ కోసం వాడుకుంటున్నారని చెప్పారు. సంస్థ విస్తరణలో భాగంగా రోజుకు అదనంగా మరో 3 లక్షల నీరు అవసరమని తమకు ఎయిమ్స్ నుంచి అభ్యర్థన వచ్చిందని, రోజుకు ఈ 3 లక్షల లీటర్ల నీటిని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా అదనంగా ఉచితంగా అందజేస్తున్నామని వివరించారు.