ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి
గుంటూరు :ముఖ్యమంత్రి జగన్‌ను నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి
కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ఆయన సీఎంతో ప్రత్యేకంగా
భేటీ అయ్యారు. నెల్లూరు రూరల్ వైసీపీ పా ఎమ్మెల్యే కోటంరెడ్డి
శ్రీధర్‌రెడ్డి అసంతృప్తి వ్యవహారం తాడేపల్లికి చేరింది. సోమవారం మధ్యాహ్నం
ఆయన సీఎం జగన్ ను కలిశారు. ఇటీవల జరిగిన సమావేశాల్లో ప్రభుత్వానికి
వ్యతిరేకంగా శ్రీధర్‌రెడ్డి పలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తన
నియోజకవర్గ పరిధిలో 2700 పింఛన్లు తొలగించడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి రావత్పైనా పలు విమర్శలు చేశారు. తన
నియోజకవర్గంలో రోడ్లు సరిగా లేవని అంసతృప్తి వ్యక్తం చేస్తూ సొంత
ప్రభుత్వంపైనే విమర్శలు చేశారు. పొట్టెపాలెం వద్ద వంతెన నిర్మాణానికి నిధుల
కొరత ఉందని, మురుగు కాలువ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని అసహనం
వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తనతో మాట్లాడేందుకు సీఎం జగన్ ఆయన్ను
పిలిపించారు. ఎందుకు విమర్శలు చేయాల్సి వచ్చిందో జగన్‌కు ఎమ్మెల్యే
శ్రీధర్‌రెడ్డి వివరించారు.