క్షతగాత్రులకు ఉత్తమ వైద్యం అందించాలని ఆదేశాలు
అమరావతి : తాడేపల్లి గూడెంలో బాణసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాద ఘటనపై సీఎం వైయస్.జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఘటనా ప్రాంతంలో తగిన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో గాయపడ్డవారికి మంచి వైద్యం అందించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున సహాయం అందించాలని, బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.