ఫిలడెల్ఫియా : జులై 7 నుంచి 9 వరకు అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరగనున్న ‘తానా’
మహాసభల్లో ‘అడ్వాన్సింగ్ హెల్త్ త్రూ డిస్రప్టివ్ ఇన్నోవేషన్’
కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా వైద్య, ఆరోగ్య రంగాల్లో
ఇటీవలి నూతన ఆవిష్కరణలు, వాటి ప్రభావాలపై ఆయా రంగాల ప్రముఖులతో చర్చ,
ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
‘క్యాన్సర్ నిర్వహణలో మనం ఎక్కడున్నాం’ అనే అంశంపై ప్రముఖ క్యాన్సర్ వైద్య
నిపుణులు, పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ప్రసంగించనున్నారు. జులై 8న
ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో మధ్యాహ్నం 2 నుంచి 3
గంటల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి అందరూ ఆహ్వానితులేనని
నిర్వాహకులు తెలిపారు. మోహన్ చదలవాడ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ
కార్యక్రమానికి ప్రపంచ ప్రసిద్ధి చెందిన క్యాన్సర్ నిపుణులు డాక్టర్ నోరి
దత్తాత్రేయుడుతో పాటు డాక్టర్ ఉమేశ్ సాలిగ్రామం, డాక్టర్ అజిత్‌సింగ్,
నరేశ్ సోని తదితరులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి బయోలారా
విసిర్పార్క్ సీఈవో డాక్టర్ హిమబిందు గడ్డిపాటి మోడరేటర్‌గా
వ్యవహరించనున్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు
కోరారు.