రోజులుగా చికిత్స పొందుతూ .. శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. తారకరత్న
పార్థివదేహాన్ని శనివారం రాత్రి పది గంటలకు ప్రత్యేక వాహనంలో హైదరాబాద్
తరలించారు. ఆదివారం హైదరాబాద్లో తారకరత్న పార్థీవదేహానికి అంత్యక్రియలు
నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. జనవరి 27న యువగళం పాదయాత్రలో
తీవ్ర అస్వస్థతకు గురైన తారకరత్నను.. 28 వ తేదిన బెంగళూరు నారాయణ హృదయాలయలో
తారకరత్నకు చికిత్స కోసం తరలించారు.తారకరత్న నటించిన చిత్రాలు
ఒకటో నెంబర్ కుర్రాడు, యువరత్న, తారక్, నో, భద్రాద్రి రాముడు, అమరావతి,
వెంకటాద్రి, ముక్కంటి, నందీశ్వరుడు, విజేత, ఎదురులేని అలెగ్జాండర్, చూడాలని
చెప్పాలని, మహాభక్త సిరియాల కాకతీయుడు, ఎవరు, మనమంత, రాజా చెయ్యి వేస్తే,
ఖయ్యూంబాయ్, దేవినేని, ఎస్ 5 నో ఎగ్జిట్, సారథి చిత్రాల్లో నటించారు.
నందమూరి రామకృష్ణ సంతాపం
తారక రత్న మృతి పట్ల ఆయన బాబాయ్ నందమూరి రామకృష్ణ సంతాపం తెలిపారు. తారక రత్న
దివికేగిన ధ్రువతార, మాతారకరత్న అని.. తారక్ ఆత్మకు శాంతి చేకూరాలని
పరమేశ్వరుడి ప్రార్థిస్తున్నానని ప్రకటించారు.సీపీఐ రామకృష్ణ : తారకరత్న మృతి
పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. తారకరత్న
కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.కేంద్రమంత్రి శ్రీ జి.కిషన్
రెడ్డి: నందమూరి తారకరత్న మృతిపై కేంద్రమంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి సంతాపం
తెలిపారు. విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న తారకరత్న చిన్నవయసులో మృతిచెందడం
దురదృష్టకరం అని అన్నారు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు
పేర్కొన్నారు. తారకరత్న కుటుంబసభ్యులకు, అభిమానులకు సానుభూతిని
తెలియజేస్తున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.టీపీసీసీ అధ్యక్షులు రేవంత్
రెడ్డి:నందమూరి వారసులు, ప్రముఖ సినీ నటులు నందమూరి తారక రత్న మృతి పట్ల
టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తారకరత్న మరణ వార్త తనను కలచివేసిందని అన్నారు. తారకరత్నమృతి రేవంత్ రెడ్డి
ప్రగాఢ సానుభూతి తెలిపారు. చిన్న వయసులోనే సినీ రంగంలో మంచి గుర్తింపు
తెచ్చుకున్న తారకరత్న మరణం సినీ రంగానికి తీరని లోటు అని వెల్లడించారు. ఆయన
ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.