పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. బీఆర్ఎస్, బీజేపీ ఆగడాలను ప్రజల ముందుకు
తీసుకెళ్లేందుకు ‘తిరగబడదాం-తరిమికొడదాం’ అనే నినాదంతో ప్రచార పోస్టర్‌ను
విడుదల చేసింది. గెలుపే లక్ష్యంగా ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ తోడు దొంగలు
బీఆర్ఎస్, బీజేపీలపై ప్రజాఛార్జ్ షీట్ పేరుతో అస్త్రాన్ని ప్రయోగించింది.
ప్రజాకోర్టు నిర్వహించి ఆ రెండు పార్టీల బాగోతాలను ఎండగడుతోంది. తోడు దొంగలు
బీఆర్ఎస్, బీజేపీలపై ప్రజాఛార్జ్ షీట్ పేరుతో ‘తిరగబడదాం-తరిమికొడదాం’
నినాదంతో ప్రచార పోస్టర్‌ను కాంగ్రెస్ నాయకులు విడుదల చేశారు. ఈ నినాదంతోనే
వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను గద్దె దించడానికి ప్రచారం సాగిస్తామని కాంగ్రెస్
శ్రేణులు తెలిపారు. సికింద్రాబాద్ గాంధీ ఐడియాలజీ సెంటర్ వద్ద నిర్వహించిన
ప్రజాకోర్టులో ఏఐసీసీ ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు
రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ సెక్రెటరీలు, వర్కింగ్
ప్రెసిడెంట్లు, ప్రొఫెసర్ కంచ ఐలయ్య, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని
పోస్టర్‌ను ప్రారంభించారు.
కాంగ్రెస్ మెనిఫెస్టో ప్రకటన వరకు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు
మెనిఫెస్టో ప్రకటన తర్వాత కాంగ్రెస్ విధానాలపై విస్తృత ప్రచారం చేయనుంది.
తెలంగాణ కాంగ్రెస్ మెనిఫెస్టోను సోనియాగాంధీ చేతుల మీదుగా విడుదల చేసేందుకు
సిద్ధమయ్యారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ నిర్వహించే సభలో ఖర్గే
పాల్గొననున్నారు. ప్రజాకోర్టు తెలంగాణ కాంగ్రెస్ నినాదమని ఇందులోనే మోదీ,
కేసీఆర్‌లను నిలబెడుతామని కాంగ్రెస్ చెబుతోంది.
అమెరికాలో బాత్ రూమ్‌లు కడిగిన కేటీఆర్‌కు వాదానికి, వ్యాధికి తేడా ఏమి
తెలుస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్, టీడీపీ మోసం చేసిందని కేసీఆర్ అంటే ఆ రెండూ పార్టీల్లోనూ కేసీఆర్
ఉన్నారని గుర్తు చేశారు. తెలంగాణ నష్టపోవడానికి కేసీఆర్‌నే మొదటి ముద్దాయని
పేర్కొన్నారు. తెలంగాణకు ద్రోహం చేస్తే ఉరితీయడం, పిండం పెట్టడం తెలంగాణ
సంస్కృతినేనని పీసీసీ ప్రెసిడెంట్ అన్నారు. తెలంగాణ పదమే ఇష్టం లేక పార్టీ
పేరు మార్చిన వ్యక్తి కేసీఆర్ అని రేవంత్ దుయ్యబట్టారు.