శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా ఎలాంటి ఘటనలకు తావు లేకుండా గట్టి చర్యలు తీసుకుంటున్న జిల్లా పోలీసులు.
తిరుపతి జిల్లా వ్యాప్తంగా డీఎస్పీలు, సిఐలు, ఎస్సైలు సిబ్బందితో ప్రధాన కూడలి నందు ఎలాంటి ఘటనలకు తావు లేకుండా గట్టి చర్యలు తీసుకోవడంతో పాటు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి అసాంఘిక ఘటనలకు ఆస్కారం లేకుండా నిరోధించడానికి మరియు మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిర్మూలన కొరకు తనిఖీలు నిర్వహించాలని జిల్లా ఎస్పీ శ్రీ పీ. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై అధికారులు తనిఖీలు నిర్వహించి పర్యవేక్షించారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న సబ్ డివిజన్లో పరిధిలో డిఎస్పీల ఆధ్వర్యంలో నిర్వహించారు. సిఐలు, ఎస్సైలు సిబ్బంది పాల్గొని ప్రతీ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా గట్టి చర్యలు తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.