గ్రామస్తులు సహాకారం తో అధికారులు అదుపులో కూలీలు.
20 మంది కూలీలు స్మగ్లర్ అరెస్ట్.
కత్తులు గొడ్డళ్ళు చదనం ముక్కలు స్వాధీనం.
కలువాయి ఎక్స్ ప్రెస్ న్యూస్..
కలువాయి మండలం వెంకట రెడ్డి పల్లి హైవే కూడలిలో తిరుపతి టాస్క్ ఫోర్స్ అధికారుల 20 మంది తమిళనాడు కు చెందిన ఎర్ర స్మగ్లర్లు, కూలీలు శనివారం రాత్రి పట్టుకొన్నారు. వారు ప్రయాణస్తున్న వాహనాన్ని అడ్డుకొన్న అధికారుల పై స్మగ్లర్లు, కూలీలు దాడికి తెగబడ్డారు. ఈ నేపథ్యంలో వెంకట రెడ్డి పల్లి గ్రామస్తుల సహకారం తో స్మగ్లర్లు, కూలీలను అధికారులు అదుపులోనికి తీసుకొన్నారు. వాహనం లో కత్తులు, గొడ్డళ్ళు, ఎర్ర చందనం దుంగలు ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు టెంపో వాహనం, స్మగ్లర్లు, కూలీలను అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకొన్న కత్తులు, గొడ్డళ్ళు, ఎర్ర చందనం దుంగలు టాస్క్ ఫోర్స్ అధికారులు వాహనం లో తిరుపతి కి తీసుకెళ్లారు.