తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ
వేంకటేశ్వర స్వామి వారిని దర్శించు కునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన
భక్తులతో 15 కంపార్టుమెంట్లు నిండి పోయాయి. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో
సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. స్వామి వారిని 57,702 మంది
దర్శించుకోగా 27,482 మంది తలనీలాలు సమర్పించు కున్నారు. భక్తులు
సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.42 కోట్లు వచ్చిందని
వెల్లడించారు.శ్రీనివాసమంగాపురంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణతిరుపతి : శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి
బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం 6 నుంచి 8 గంటల
వరకు పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా
బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల కారణంగా ఆలయంలో
అన్ని రకాల ఆర్జితసేవలను టీటీడీ రద్దు చేసింది.

13న ప్రత్యేక ప్రవేశ టికెట్లు విడుదల
తిరుమల : శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 13న ఉదయం 9 గంటలకు టికెట్లను ఆన్లైన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 21వ తేదీ వరకు జనవరి కోటాను జనవరిలో విడుదల చేసిన విషయం తెలిసిందే. బాలాలయం కార్యక్రమం సందర్భంగా ఆయా రోజుల్లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేయలేదు. బాలాలయాన్ని వాయిదా వేయగా టికెట్లను విడుదల చేయనున్నది. ఈ మేరకు భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరింది.