సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ
తిరుమల : రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ, సినిమాటోగ్రఫీ, వెనుక బడిన తరగతుల
శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ తిరుమల శ్రీవారిని ప్రాతః
కాల సేవలో కుటుంబ సమేతంగా సేవించి దర్శించుకున్నారు. స్వామి వారి దర్శన అనంతరం
ఆలయ వెలుపల మీడియా తో మంత్రి మాట్లాడుతూ ముందుగా ఓం నమో వెంకటేశాయ వెంకటాద్రి
సమస్తానం బ్రహ్మాణ్డె నాస్తి కించనః వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని
స్వామి వారిని స్మరిస్తూ ఈ రోజు పెరుమాల్ని స్వామివారిని ప్రాతఃకాల సేవలో
సేవించి, తాను ప్రధానంగా వేడుకున్నది కోరుకున్నది ఏమంటే అంటూ ఈ రాష్ట్రంలో
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రభుత్వం పాలనలోకి వచ్చాక ఎన్నో సంక్షేమ
కార్యక్రమాలు చేపట్టారని ఇది ప్రజలు మెచ్చిన ప్రభుత్వమని అన్నారు.
ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు సుస్థిరమైన జీవనాన్ని సాగించే
దిశగా పాలన అందిస్తున్నారని పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ పేదవారి
గడపకు పాలన అందించడమే లక్ష్యంగా పేదల సంక్షేమం అభివృద్ధి దిశగా ఈ ప్రభుత్వం
పనిచేస్తోందని, గతంలో మాటలే కానీ చేతలు లేవనీ ఈ ప్రభుత్వం చేతలే కానీ మాటలు
కాదని అన్నారు. ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్న జగన్మోహన్ రెడ్డి పాలనపై
కొంత మంది దురుద్దేశంతో కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారనీ వాటన్నింటినీ విఫలం
చేయమని, ధర్మం కాపాడుతూ న్యాయస్థానాలు పనిచేస్తున్నాయని, ఏ సత్సంకల్పంతో
అయితే స్వామి ఆశీస్సులతో పాలకుడైనటువంటి జగన్ మోహన్ రెడ్డి గారిని మరింతగా
అనుగ్రహించమని, వారి మంచి ఆలోచనలు సిద్ధించాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల
కష్టాలని తొలగించాలని, అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మీద సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించమని స్వామి
వారిని వేడుకున్నానని తెలిపారు.