మమేకమవ్వాలి : కేంద్ర మంత్రి
తిరుమల : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా దేశమంతా మేరా మిట్టీ –
మేరా దేశ్ (నా భూమి – నా దేశం) అనే నినాదంతో చేపడుతున్న కార్యక్రమాన్ని
దేశంలోని ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ
శాఖ క్యాబినెట్ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. తిరుమల, తిరుపతి
పర్యటనలో భాగంగా నేటి ఆదివారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న
కేంద్ర మంత్రికి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా విమానాశ్రయంలో మంత్రి
మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రి పిలుపు మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్
కార్యక్రమంలో భాగంగా దేశమంతా మేరా మిట్టీ – మేరా దేశ్ (నా భూమి – నా దేశం) అనే
నినాదంతో అనేక కార్యక్రమాలు అన్ని రాష్ట్రాల్లో చేపడుతున్నారని, అందులో ప్రతి
ఇంటి నుండి గ్రామం, పంచాయతీ వరకు అక్కడి నుండి మండలం, జిల్లా, రాష్ట్రస్థాయి
మరియు దేశ స్థాయి వరకు మట్టి కలశాలను తీసుకెళ్లి యువత సదరు కార్యక్రమంలో
పాల్గొంటారని అందులో ప్రధాన మంత్రి పాల్గొంటారని తెలిపారు. మన దేశ స్వాతంత్రం
కోసం పోరాడిన వీర సైనికుల అమరవీరుల జ్ఞాపకార్థం దేశభక్తి చాటుతూ ఈ
కార్యక్రమంలో ప్రజలు అందరూ మేరా మిట్టి – మేరా దేశ్ (నా భూమి -నా దేశం)
కార్యక్రమంలో మమేకం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. అనంతరం తిరుమల చేరుకుని
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల కేంద్ర మంత్రి మీడియా తో
మాట్లాడుతూ తిరుమల శ్రీ బాలాజీ స్వామి వారిని ఎప్పుడు దర్శించుకున్న కూడా ఒక
కొత్త దివ్యానుభూతి, శక్తి కలుగుతుందని, మన దేశ ప్రధానమంత్రి నేతృత్వంలో దేశం
ఎంతో పురోగతి సాధించిందని, మున్ముందు ఎంతగానో అభివృద్ధి పథంలో వెళ్లాలని, మన
దేశం రాబోయే 25 సంవత్సరాల కాలంలో అమృత కాలం నుండి స్వర్ణిమకాలంకి ముందుకు
వెళ్లాలని, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ఇనుమడించిన శక్తితో
ప్రజలను పేదరికం నుండి బయట పడేలా చేయడానికి అన్ని రకాలుగా శక్తి సామర్థ్యాలను
తమకు ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థించానని తెలిపారు. అనంతరం చెన్నై కి బయల్దేరి
వెళ్ళారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా రేడియో స్టేషన్ తిరుపతి హెడ్ డిడి బాల
సుబ్రమణ్యం, ప్రోగ్రాం ఎక్జిక్యూటివ్ హెడ్ సుధాకర్ మోహన్, టిటిడి మాజీ బోర్డు
సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, డీడీ, ఏఐఆర్ సిబ్బంది తదితరులు మంత్రికి
స్వాగతం, వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు.