కారణంగా వేంకటేశ్వరుడికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబరు
18 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటే ప్రతి ఏటా
నిర్వహించేవి. అక్టోబరు 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు
నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ ) ప్రకటించింది.
సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలివే
సెప్టెంబరు 18న – ధ్వజారోహణం
సెప్టెంబరు 22న – గరుడ వాహన సేవ
సెప్టెంబరు 23న – స్వర్ణ రథం
సెప్టెంబరు 25న – రథోత్సవం (మహారథం)
సెప్టెంబరు 26న – చక్రస్నానం, ధ్వజావరోహణం ఉంటాయి.
నవరాత్రి బ్రహ్మోత్సవాల తేదీలివే
అక్టోబరు 19న – గరుడవాహన సేవ
అక్టోబరు 22న – స్వర్ణరథం
అక్టోబరు 23న – చక్రస్నానం
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సెప్టెంబరు 18 నుంచి 26 వరకు, అక్టోబరు 15 నుంచి 23వ
తేదీ వరకు అష్టాదళ పాదపద్మారాధన, తిరుప్పావడై, కల్యాణోత్సవం, ఊంజల్
సేవ, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేస్తున్నట్లు తితిదే వెల్లడించింది.
ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులను
నిర్దేశిత వాహనసేవకు మాత్రమే అనుమతించనున్నట్లు తెలిపింది. నవరాత్రి
బ్రహ్మోత్సవాల అంకురార్పణ కారణంగా అక్టోబరు 14న సహస్రదీపాలంకార సేవను రద్దు
చేసినట్లు టీటీడీ ప్రకటించింది.