ఉద్యోగుల సంఘం పిటిషన్పై హైకోర్టులో విచారణ
వెలగపూడి : షోకాజ్ నోటీసుల ఆధారంగా ఉద్యోగులపై చర్యలు తీసుకోవద్దని
ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. జీతాల విషయంలో గవర్నర్కు వినతిపత్రం
ఇచ్చిన ఉద్యోగులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దీనిపై ఉద్యోగుల సంఘం
నేత సూర్య నారాయణ హైకోర్టులో పిటిషన్పై దాఖలు చేశారు. దీన్ని విచారించిన
న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు వెలువరించే వరకు ఉద్యోగులపై
చర్యలొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.