త్వరగా చెల్లింపులు: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
హైదరాబాద్ : తునికాకు సేకరించే కూలీలకు రూ.233 కోట్ల బోనస్
చెల్లించనున్నారు. ఈ మొత్తాన్ని త్వరగా చెల్లించాలని అటవీశాఖ మంత్రి
ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. ఆయన అరణ్యభవన్‌లో అటవీశాఖ
ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని 30 జిల్లాలు, 37 అటవీ డివిజన్లలో
గిరిజనులు తెచ్చే తునికాకు(బీడీ ఆకు)ను రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ద్వారా
సేకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఇరు రాష్ట్రాల నికర ఆదాయ వాటాను
తేల్చడం, కూలీలు వేర్వేరు ప్రాంతాల్లో ఉండటంతో వివరాల సేకరణ, డబ్బుల చెల్లింపు
ఆలస్యమైందని అధికారులు మంత్రికి వివరించారు. సమావేశంలో ఎమ్మెల్యే దుర్గం
చిన్నయ్య, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్,
హెచ్ఓఎఫ్ఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్, అటవీ అభివృద్ధి సంస్థ వీసీ, ఎండీ
చంద్రశేఖర్‌రెడ్డి అదనపు పీసీసీఎఫ్ వినయ్‌కుమార్ పాల్గొన్నారు.