అమరావతి : బంగాళా ఖాతంలో ఏర్పడిన తుఫానును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని
విధాలా పూర్తి సన్నద్ధంగా ఉన్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్
రెడ్డి కేబినెట్ కార్యదర్శికి వివరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుపై
మంగళవారం ఢిల్లీ నుండి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ ఆంధ్రప్రదేశ్,
తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం
ద్వారా తుఫానును ఎదుర్కునేందుకు తీసుకుంటున్న ముందస్తు ఏర్పాట్లపై
సమీక్షించారు. ఈసందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి
మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రధానంగా నాలుగు దక్షిణాంధ్ర జిల్లాలు నెల్లూరు,
ప్రకాశం, చిత్తూరు, అనంతపురం జిల్లాలతోపాటు మరో రెండు సమీప జిల్లాలపై దీనిపై
ప్రభావం ఉంటుందని వివరించారు.ఆయా జిల్లాల్లో అధికార యంత్రాంగాలను ఇప్పటికే
పూర్తి అప్రమత్తం చేశామని తెలిపారు.మండల స్థాయి నుండి జిల్లా,రాష్ట్ర స్థాయి
వరకూ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశామని చెప్పారు.ముఖ్యంగా బలహీనంగా
ఉన్నఏటిగట్లు,రిజర్వాయర్లకు గండ్లు పడకుండా ప్ర్రత్యేక దృష్టి సారించినట్టు
తెలిపారు.ప్రస్తుతం 11 ఎస్డిఆర్ఎఫ్ బృందాలు,10 ఎన్డిఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో
ఉన్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి వివరించారు.
తుఫాను దృష్ట్యా మత్స్యకారులు ఎవరూ సముద్రంలోనికి చేపల వేటకు వెళ్లవద్దని
ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశామని అంతేగాక ఎవరైనా ఇప్పటికే సముద్రంలో చేపల
వేటకు వెళ్ళి ఉంటే వారు వెంటనే తిరిగి ఒడ్డుకు చేరుకోవాలని కూడా సందేశాలు
పంపినట్టు సిఎస్.డా.జవహర్ రెడ్డి కేబినెట్ కార్యదర్శికి వివరించారు.తుఫాను
ప్రభావం ఉండే ఆయా జిల్లాల యంత్రాంగాలను పూర్తిగా అప్రమత్తం చేసి తుఫానును
సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా పూర్తి సన్నద్ధంగా ఉన్నామని ప్రభుత్వ
ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి పేర్కొన్నారు. వీడియో సమావేశంలో
కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ మాట్లాడుతూ తుఫానును సమర్ధవంతంగా
ఎదుర్కొనేందుకు మూడు రాష్ట్రాలు పూర్తి సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు.
ముఖ్యంగా పల్లపు ప్రాంతాల్లో నివసించే ప్రజలను,గుడిసెలు,కచ్చా ఇళ్ళలో నివసించే
వారిని పూర్తిగా అప్రమత్తం చేయాలని సూచించారు.తుఫాను ముందస్తు సన్నాహక
ఏర్పాట్లలో ఎలాంటి లోపాలకు తావీయకుండా అన్ని విధాలా పూర్తి అప్రమత్తతతో
ఉండాలని ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధమై ఉండాలని మూడు
రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ
ఆదేశించారు. ఈవీడియో సమావేశంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్
బిఆర్.అంబేద్కర్, భారత వాతావరణ శాఖ రాష్ట్ర సంచాలకులు స్టెల్లా తదితరులు
పాల్గొన్నారు.