అమరావతి : తీవ్ర తుపాను గా మారిన మాండౌస్పై సీఎస్ జవహర్ రెడ్డి అధికారులతో
టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలపై
శనివారం సీఎస్ క్యాంపు కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్
నిర్వహించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ఆయా జిల్లాల కలెక్టర్లు శని,
ఆదివారాలు రెండు రోజులు గ్రామాల్లో పర్యటించాలని సిఎస్ ఆదేశించారు. వర్షపు
నీరు తొలగిన తర్వాత నష్టం అంచనాకు ఎన్యుమరేషన్ ప్రక్రియను చేపట్టాలని సీఎస్
జవహర్ రెడ్డి ఆదేశించారు. తిరుపతి పట్టణంలో వర్షపు నీరు త్వరిత గతిన దిగువకు
వెళ్ళేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి కలెక్టర్కు సీఎస్ జవహర్ రెడ్డి
ఆదేశించారు. భారీ వర్షాలు పడిన ప్రాంతాల్లో వెంటనే శానిటేషన్ పనులు
చేపట్టాలని, వర్షపు నీరు తగ్గిన వెంటనే పంట నష్టం అంచనాలు చేపట్టాలని
సూచించారు. కాగా ఈ కాన్ఫరెన్స్లో సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.పూనం
మాలకొండయ్య పాల్గొన్నారు. కాగా శుక్రవారం రాత్రి 8.30 గం.ల నుంచి శనివారం ఉదయం
8.30 గంటల వరకు అన్నమయ్య జిల్లాలో 23.3 మిల్లీ మీటర్లు, చిత్తూరు జిల్లాలో
30.5, ప్రకాశం జిల్లాలో 14.1, ఎస్పీ ఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో 57.6, తిరుపతి
జిల్లాలో 75.7, వైయస్సార్ కడప జిల్లాలో 14.5 మిల్లీమీటర్ల వంతున సరాసరి
వర్షపాతం నమోదయినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. గత
24 గంటల్లో ఆరు జిల్లాల్లోని 109 ప్రాంతాల్లో 64.5 మిల్లీ మీటర్లకంటే అధిక
వర్షపాతం నమోదయిందన్నారు.