న్యూఢిల్లీ : డిసెంబర్ 15వ తేదీ నుంచి భారత వాయుసేన తూర్పు సెక్టార్లో
రెండురోజుల పాటు యుద్ధ విన్యాసాలను నిర్వహించనుంది. దీనిలో ఫైటర్జెట్లు,
రవాణా విమానాలు, హెలికాప్టర్లు, మానవరహిత విమానాలు పాల్గొననున్నాయి. ఈ
సందర్భంగా తేజ్‌పూర్, చుబువా, జోర్హాట్, హష్మీరా వైమానిక స్థావరాల
సన్నద్దతను పరిశీలించనున్నారు. వాస్తవాధీన రేఖ వెంట వాయుసేన పనితీరును
పరిశీలించేందుకు ఈస్ట్రన్ కమాండ్ వీటిని నిర్వహిస్తోంది. చాలా రోజుల
ముందుగానే వీటికి సంబంధించిన షెడ్యూల్ కూడా సిద్ధమైంది. ఇటీవల జరగిన ఘర్షణతో
ఈ యుద్ధ విన్యాసాలకు సంబంధం లేదని వాయుసేన చెబుతోంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని
తవాంగ్ సెక్టార్లో యాంగ్జే వద్ద డిసెంబర్ 9వ తేదీన భారత్-చైనా దళాల మధ్య
ఘర్షణతో వాస్తవాధీన రేఖ ఉద్రిక్తంగా మారింది. తూర్పు సెక్టార్లో వైమానిక
విన్యాసాలు నిర్వహించనున్న సమయంలోనే ఈ ఘర్షణ జరగడం గమనార్హం. మరోపక్క
అరుణాచల్ ప్రదేశ్‌కు సమీపంలోకి ఓ విమానాశ్రయంలో బీజింగ్ మోహరింపులు
పెరుగుతున్నాయి. భారత్ చైనా సరిహద్దులకు 155 కిలోమీటర్లు ఉత్తరాన ఉన్న
షిగాట్సే ఎయిర్‌పోర్టులో కదలికలు పెరిగాయి. ఇక్కడ చైనా ఫైటర్జెట్లు,
ఎయిర్‌బార్న్ ఎర్లీ వార్నింగ్ వ్యవస్థలు, మానవ రహిత విమానాలను నిలిపి
ఉంచింది.పాంగాంగ్ సరస్సు వద్ద భారీగా నిర్మాణాలు : మరోవైపు చైనా కీలకమైన పాంగాంగ్
సరస్సు వద్ద భారీగా నిర్మాణాలు చేపడుతున్నట్లు ఉపగ్రహ చిత్రాలు చెబుతున్నాయి.
ఇక్కడ అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకొన్నాయి. ఈ
ప్రదేశంలో పాంగాంగ్ సమీపంలోని ఖుర్నాక్ పోర్టు వద్ద ఉంది. ఈ ప్రదేశంలో
పేలుళ్లను తట్టుకొనేలా బంకర్లు కూడా ఏర్పాటు చేసుకొంది.