హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా
మారిందని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆదివారం హరీశ్‌రావు సమక్షంలో
జహీరాబాద్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు భారాసలో
చేరారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర
పోషించిన ఉపాధ్యాయ సంఘం నేతలు భారాసలో చేరడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎకరానికి 3గంటలు కరెంటు చాలంటున్నారు.
వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు నాయుడికి రేవంత్‌రెడ్డి అసలైన వారసుడిగా మారారు.
రేవంత్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉచిత కరెంటు ఉత్త కరెంటు అనలేదా? కాంగ్రెస్
పాలనలో కరెంటు బాగుందా? భారాస పాలనలో కరెంటు బాగుందా? తెలంగాణ సమాజం
ఆలోచించాలి. కేసీఆర్ పాలనలో అద్భుతమైన పంటలు పండుతున్నాయి. రైతులకు 3గంటలు
కరెంటు కావాలో, 24గంటలు కావాలో తెలియదా? కరెంటుపై ఎంత చర్చ జరిగితే భారాసకు
అంత లాభం. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 24 గంటల కరెంటు ఇస్తున్నారా? మొదటి
నుంచి తెలంగాణకు కాంగ్రెస్‌పార్టీ వ్యతిరేకంగా ఉంది. హైదరాబాద్ రాష్ట్రాన్ని
ఏపీలో కలిపింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణను ముంచే పోలవరం ప్రాజెక్టుకు
ముగ్గు పోసింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని
రంగాల్లో ముందుకు పోతోంది. ప్రాజెక్టులు అడ్డుకునేందుకు కాంగ్రెస్‌నేతలు
కోర్టుల్లో కేసులు వేస్తారు. భూ సేకరణ జరగకుండా అడ్డుకుంటున్నారు. కాళేశ్వరం
ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తెలంగాణ ఖ్యాతిని దెబ్బతీస్తున్నారు. తెలంగాణ
మోడల్ కావాలని మహారాష్ట్ర ప్రజలు అంటున్నారు. కేసీఆర్ ఎక్కడ పోటీచేసినా
ప్రజలు కళ్లకు అద్దుకుని గెలిపిస్తారని హరీశ్‌రావు అన్నారు.