గడిచిన ఏడాది కన్నా3,63,953 మంది తగ్గారు
హైదరాబాద్ : ‘రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 2,99,92,941కు చేరింది. గత ఏడాదితో
పోలిస్తే 3,63,953 మంది ఓటర్లు తగ్గారు. 18 నుంచి 19 సంవత్సరాల వయసున్న ఓటర్లు
2,78,650 మంది నమోదు చేసుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ముఖ్య
ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ వెల్లడించారు. ‘రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య
2,99,92,941కు చేరింది. గత ఏడాదితో పోలిస్తే 3,63,953 మంది ఓటర్లు తగ్గారు. 18
నుంచి 19 సంవత్సరాల వయసున్న ఓటర్లు 2,78,650 మంది నమోదు చేసుకున్నారు’ అని
కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్
వెల్లడించారు. ‘ఓటర్ల జాబితా సవరణలో భాగంగా చేరికలు, తొలగింపు ప్రక్రియను
నిర్వహించి ఏటా జనవరి 5వ తేదీన తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం
వెలువరిస్తుంది. గత ఏడాది 3,03,56,894 మంది ఓటర్లు ఉండగా ఆ సంఖ్య
2,99,92,941కి తగ్గింది. గడిచిన ఏడాది ఒకే ఫొటోతో ఉన్న, వేర్వేరు
ప్రాంతాల్లోని ఓటర్లను గుర్తించి తొలగించడంతో సంఖ్య తగ్గింది. మొత్తం ఓటర్లలో
మహిళల కన్నా పురుషులు 1,25,221 మంది మాత్రమే ఎక్కువ ఉన్నారు. సర్వీసు ఓటర్లు
15,282 మంది, ఎన్నారై ఓటర్లు 2,740 మంది ఉన్నారు. రాష్ట్రంలోని 19,314
ప్రాంతాల్లో 34,891 పోలింగు కేంద్రాలున్నాయి. ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా
యువతను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని 1,700 కళాశాలల్లో ఓటు నమోదు ప్రచారం
నిర్వహించాం. క్యాంపస్ అంబాసిడర్లను గుర్తించి ఎలక్షన్ లిటరసీ క్లబ్బులు
ఏర్పాటు చేశాం. విద్యార్థులకు సంక్షిప్త సందేశాలు పంపి చైతన్యవంతుల్ని చేశాం.
361 గిరిజన తండాల్లో ప్రచారం నిర్వహించి ఇప్పటివరకు ఓటు హక్కులేని 2,800
మందిని గుర్తించి ఓటర్లుగా నమోదు చేశాం. పట్టణ ప్రాంత ప్రజల కోసం పలు సాంఘిక
సంక్షేమ సంఘాల్లో సమావేశాలు నిర్వహించాం. పోలింగు కేంద్రం అధికారులు ఇంటింటికీ
తిరిగి నమోదు ప్రక్రియ చేపట్టారు. అర్హులైన ఓటర్లను నమోదు చేయించే విషయంలో
అన్ని స్థాయుల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాం’ అని
వికాస్‌రాజ్ పేర్కొన్నారు.