గురవుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబంపై
విమర్శలు ఎక్కుపెట్టిన ఆయన కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలన్నారు. రాష్ట్రంలో
బీజేపీ చేపట్టిన ‘ప్రజా గోస- బీజేపీ భరోసా’ కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ
రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ఇతర నేతలు విస్తృతంగా
పర్యటిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన వీధి సభకు హాజరైన కిషన్‌రెడ్డి
రాష్ట్రంలో పేదల ప్రభుత్వం తీసుకువస్తామని తెలిపారు.’ప్రజాగోస-బీజేపీ భరోసా’ పేరుతో రాష్ట్రంలో బీజేపీ వీధివీధిన సమావేశాలు
నిర్వహిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటడమే లక్ష్యంగా ప్రణాళికలు
రచిస్తున్న కమలదళం కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర సర్కార్ వైఫల్యాలను
వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో జరిగిన కార్నర్
మీటింగ్‌కు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. కేంద్రం
సహకారంతో పక్క రాష్ట్రం ఏపీలో లక్షల ఇళ్లు నిర్మిస్తుంటే కేసీఆర్ మాత్రం ఆ
దిశగా ఆలోచించటం లేదన్నారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం కాదని, రాష్ట్రంలో
కల్వకుంట్ల రాజ్యాంగం అమలుచేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో 24గంటల కరెంటు వస్తే రాజీనామా చేసేందుకు సిద్ధం
బీజేపీ అధికారంలోకి వచ్చాక నయీమ్ డైరీ, ఆస్తులను బయటికి తీసుకువస్తామని ఆ
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా
ఆలేరు, జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో జరిగిన వీధి సభలకు ఆయన హాజరయ్యారు.
తమ అనుచరుల వ్యాపారాలకు మేలు చేసేందుకే కేసీఆర్ మిషన్ భగీరథ తెచ్చారన్న
సంజయ్ రాష్ట్రంలో 24గంటల కరెంటు వస్తే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు.
వ్యాపార ప్రయోజనాల కోసమే యాదగిరిగుట్ట ఆలయాన్ని నిర్మించారని ఆరోపించారు.
నేడు కేసీఆర్ సైతం అదే ధోరణి: హైదరాబాద్ కూకట్‌పల్లిలోని రామాలయం కూడలిలో
జరిగిన బీజేపీ సమావేశానికి ఆ పార్టీ జాతీయ కార్యవర్గసభ్యురాలు విజయశాంతి
హాజరయ్యారు. నాడు నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు బానిస బతుకులు బతికారన్న
విజయశాంతి నేడు కేసీఆర్ సైతం అదే ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. మోడీ
సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియకుండా కప్పిపుచ్చుతున్నారని ఆమె విమర్శించారు.