అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్న బీఆర్ఎస్
ఎన్నికల్లో గెలుపుపై ఎవరి ధీమా వారిదే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై వెలువడ్డ సర్వే
హైదరాబాద్ : హ్యాట్రిక్ విజయం ఖాయమంటూ బీఆర్ఎస్, ఈసారి అధికారం
హస్తగతమవుతుందంటూ కాంగ్రెస్, డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడడం పక్కా అంటూ బీజేపీ
ఇలా తెలంగాణలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. అక్టోబర్ చివరినాటికల్లా
నోటిఫికేషన్ వస్తుందనే అంచనాల నేపథ్యంలో పార్టీలన్నీ అస్త్రశస్త్రాలకు
పదునుపెడుతున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ముక్కోణపు
పోరు ఖాయమనే విశ్లేషణల నేపథ్యంలో ఆ మూడు పార్టీలు సంసిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో
ప్రత్యేక కథనం ఇది
అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్న బీఆర్ఎస్ : కాంగ్రెస్ తమకు పోటీనే కాదంటూ
తమను ఢీకొట్టే సత్తా బీజేపీకి లేదని బీఆర్ఎస్ చెబుతున్నప్పటికీ అదంతా
పైపైకేనని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. లోలోన ఆ పార్టీ కలవరపాటుకు
గురవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ రూపంలో
ముప్పుపొంచివుందని గ్రహించిన గులాబీ దళపతి ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోకూడదని
భావిస్తున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు అధికారంలో ఉండడంతో ఈసారి
ప్రజావ్యతిరేకత తప్పదనే అంచనాలు బీఆర్ఎస్ శ్రేణులను భయపెడుతున్నాయి. తేడా
పడితే అధికారం చేజారిపోతుందనే భయం ఆ పార్టీని వెంటాడుతోందనే విశ్లేషణలు
వినిపిస్తున్నాయి. అందుకే వీలైనన్ని తాయిళాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంపై ఆ
పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఉన్నపళంగా ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, రుణమాఫీ,
ఇండ్ల పంపిణీతోపాటు ఈమధ్య చాలా కార్యక్రమాలు ఈ కోవ కిందికే వస్తాయి.
ఇక పార్టీపరంగా చూసినా క్షేత్రస్థాయిలోనూ బీఆర్ఎస్కు సానుకూల వాతావరణం
కనిపించకపోవడం ఆ పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. ముఖ్యంగా కొన్ని పథకాల్లో
స్వయంగా ఎమ్మెల్యేలే అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు రావడం చేటు
చేస్తుందేమోనని భయం పట్టుకుందట. సిట్టింగుల్లో పలువురికి సీట్లు దక్కడం
కష్టమేననే విశ్లేషణలు ఆ పార్టీ శ్రేణుల కలవరానికి అద్దం పడుతోందనే
విశ్లేషణలున్నాయి. మరోవైపు అభ్యర్థుల ఎంపిక కోసం ఇప్పటికే పలుమార్లు సర్వేలు
నిర్వహించగా వడపోతలపై గులాబీ బాస్ కేసీఆర్ దృష్టిపెట్టారని తెలుస్తోంది.
అసంతృప్తులు పార్టీని వీడే అవకాశం ఉండడంతో ఆచితూచి వ్యవహరించేలా పావులు
కదుపుతున్నట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరగా అభ్యర్థుల జాబితా ఖరారు చేయాలని
భావిస్తున్నట్టు తెలసింది. కాంగ్రెస్ తమకు పోటీనే కాదంటూ తమను ఢీకొట్టే సత్తా
బీజేపీకి లేదని బీఆర్ఎస్ చెబుతున్నప్పటికీ అదంతా పైపైకేనని రాజకీయవర్గాలు
విశ్లేషిస్తున్నాయి. లోలోన ఆ పార్టీ కలవరపాటుకు గురవుతోందనే అభిప్రాయాలు
వ్యక్తమవుతున్నాయి. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ రూపంలో ముప్పుపొంచివుందని
గ్రహించిన గులాబీ దళపతి ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోకూడదని భావిస్తున్నారు.
ఇప్పటికే రెండు పర్యాయాలు అధికారంలో ఉండడంతో ఈసారి ప్రజావ్యతిరేకత తప్పదనే
అంచనాలు బీఆర్ఎస్ శ్రేణులను భయపెడుతున్నాయట. తేడా పడితే అధికారం
చేజారిపోతుందనే భయం ఆ పార్టీని వెంటాడుతోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
అందుకే వీలైనన్ని తాయిళాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంపై ఆ పార్టీ పూర్తిగా
ఫోకస్ పెట్టింది. ఉన్నపళంగా ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, రుణమాఫీ, ఇండ్ల
పంపిణీతోపాటు ఈమధ్య చాలా కార్యక్రమాలు ఈ కోవ కిందికే వస్తాయంటున్నారు.
ఇక పార్టీపరంగా చూసినా క్షేత్రస్థాయిలోనూ బీఆర్ఎస్కు సానుకూల వాతావరణం
కనిపించకపోవడం ఆ పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది . ముఖ్యంగా కొన్ని పథకాల్లో
స్వయంగా ఎమ్మెల్యేలే అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు రావడం చేటు
చేస్తుందేమోనని భయం పట్టుకుందట. సిట్టింగుల్లో పలువురికి సీట్లు దక్కడం
కష్టమేననే విశ్లేషణలు ఆ పార్టీ శ్రేణుల కలవరానికి అద్దం పడుతోందనే
విశ్లేషణలున్నాయి. మరోవైపు అభ్యర్థుల ఎంపిక కోసం ఇప్పటికే పలుమార్లు సర్వేలు
నిర్వహించగా వడపోతలపై గులాబీ బాస్ కేసీఆర్ దృష్టిపెట్టారని తెలుస్తోంది.
అసంతృప్తులు పార్టీని వీడే అవకాశం ఉండడంతో ఆచితూచి వ్యవహరించేలా పావులు
కదుపుతున్నట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరగా అభ్యర్థుల జాబితా ఖరారు చేయాలని
భావిస్తున్నట్టు సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై ఎవరి ధీమా వారిదే. హ్యాట్రిక్
కొట్టబోతున్నామని బీఆర్ఎస్ చెబుతుంటే మూడోసారి ఎలాగెలుస్తారో చూద్దామని
కాంగ్రెస్ , బీజేపీ నేతలు సవాల్ విసురుతున్నారు. కర్ణాటక తర్వాత తాము
గెలవబోయేది తెలంగాణలోనే అని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటోంది. ఇదిగో రేపో,
మాపో అధికారంలోకి వచ్చేస్తున్నామనేంతలా సీన్ క్రియేట్ చేసిన కమలనాథులు ఈ మధ్య
ఎందుకో ఢీలా పడిపోయారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని
సీట్లు వస్తాయి..? ఏ పార్టీకి ఎంత ఓటు శాతం వస్తుందని తాజాగా ఓ సర్వే
జరిగింది. ఆ సర్వే ప్రకారం ఏ పార్టీకి ఎన్నొస్తాయో టీపీసీసీ చీఫ్ రేవంత్
రెడ్డి చిట్ చాట్లో భాగంగా చెప్పేశారు. రేవంత్ చెప్పిన దాని ప్రకారం తాజా
సర్వేల ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ ముందంజలో ఉందని రేవంత్రెడ్డి ధీమాగా
చెప్పారు. మునుపటితో పోలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుందని స్పష్టం
చేశారు. అయితే బీజేపీ 21 శాతం నుంచి దాదాపు07శాతం వరకు పడిపోయిందన్నారు. అయితే
రేవంత్ వ్యక్తిగతంగా ఈ సర్వేలు చేయించారా..? పార్టీ తరఫున చేయించారా..? అనే
విషయాలను చెప్పలేదు. బీఆర్ఎస్ : 45 స్థానాలు, కాంగ్రెస్ : 45 స్థానాలు,
బీజేపీ : 7 స్థానాలు, ఎంఐఎం : 7 సీట్లు వస్తాయని 15 సీట్లలో ప్రత్యర్థితో
కాంగ్రెస్కు గట్టిపోటీ ఉంటుందని రేవంత్ జోస్యం చెప్పారు. ఓట్ల శాతం చూస్తే
బీఆర్ఎస్ : 37 శాతం, కాంగ్రెస్ :35 శాతం, బీజేపీ : 14 శాతం, ఎంఐఎం : 03
శాతంగా తేలింది.