ఘనంగా తెలంగాణ అమరవీరుల సంస్కరణ దినోత్సవం
రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి
ఎర్రబెల్లి దయాకర్ రావు
జనగామ : తెలంగాణ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర పంచాయతీరాజ్
గ్రామీణ అభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
అన్నారు.
గురువారం జనగామ జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర
అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ అమరవీరుల సంస్కరణ దినోత్సవం
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పోరాడి తెచ్చుకున్న
తెలంగాణలో అమరవీరుల పాత్ర కీలకమైనదని వారి ప్రాణ త్యాగాలు వెలకట్టలేనివని
అన్నారు. గత 22 రోజులుగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా
ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఘనంగా పండుగ వాతావరణం లో ఆ
కార్యక్రమాలను విజయవంతం చేశామని ప్రభుత్వం 9 సంవత్సరాల లో ప్రవేశపెట్టిన
సంక్షేమ పథకాలు అభివృద్ధి దేశానికె ఆదర్శప్రాయంగా ఉందని అన్నారు తెలంగాణ రాక
ముందుకు వచ్చిన తర్వాత తేడాలను వివరిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించామని అన్నారు
స్వతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ రీతిలో తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి కేసీఆర్
పాల్గొన్నారు తెలిపారు,
అమరులను స్మరించుకుంటూ వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు గృహలక్ష్మి, దళిత బంధు,
బీసీ రుణాలు, తదితర పథకాలలో మొదటి ప్రాధాన్యత కల్పించాలని జిల్లా కలెక్టర్కు
సూచించారు.
జిల్లా పరిషత్ చైర్పర్సన్ పాగాల సంపత్ రెడ్డి మాట్లాడుతూ అనేక ఉద్యమాల పోరాట
ఫలితం తెలంగాణ రాష్ట్రం అని అమరుల త్యాగాలకు ఏం చేసినా తక్కువే అని అన్నారు
దేశం గర్వించదగ్గంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని
అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఎడవల్లి కృష్ణారెడ్డి మాట్లాడుతూ అమరుల
త్యాగాల వల్ల ప్రస్తుతము ప్రశాంత తెలంగాణ లో ఉన్నామని వారి త్యాగాలకు
స్మరించుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు
జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ముందుకు
ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఇబ్బందులకు గురయ్యామని నీళ్ళు, నిధులు, నియామకాలలో
తీవ్ర అన్యాయం జరిగిందని గుర్తుకు చేశారు ప్రతి విషయంలో అణిచివేత, కుట్రపూరిత
ధోరణితో ఉండేవారని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కోసం ఉద్యోగ సంఘాలు ప్రజా
సంఘాలు పాత్రికేయులు అనేక వర్గాల ప్రజలు ఒకతాటిపై ఉద్యమం సకల జనుల సమ్మె చేసి
తెలంగాణ సాధించారని ప్రస్తుతం స్వేచ్ఛ వాతావరణం లో తెలంగాణ రాష్ట్రం సంక్షేమ
పథకకాలలో ఉద్యోగులు కూడా ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తున్నారని తెలిపారు.
అమరవీరుల కుటుంబ సభ్యుల ను ఘనంగా సన్మానించారు. అంతకుముందు అమరవీరుల
స్తూపానికి నివాళులు అర్పించి మౌనం పాటించారు. కార్యక్రమం అనంతరం అమరవీరుల
కుటుంబాలతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రపుల్
దేశాయ్, రోహిత్ సింగ్, డిసిపి సీతారాం, శ్రీకాంతాచారి తండ్రి, అమరవీరుల కుటుంబ
సభ్యులు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.