హైదరాబాద్ : ఎంసెట్‌కు హాజరయ్యేందుకు ఇంటర్లో 45 శాతం మార్కులు తప్పక
ఉండాలన్న నిబంధనను ఈ ఏడాది పునరుద్ధరించనున్నారు. నిర్దిష్ట మార్కులు సాధించిన
వారే ఎంసెట్ రాసే అవకాశం కల్పించాలని అధికారు లు నిర్ణయించారు. జనరల్
క్యాటగిరీ విద్యార్థులు ఇంటర్ గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో 45 శాతం
మార్కులు, రిజర్వేషన్ క్యాటగిరీ వారు 40 శాతం మార్కులు తప్పనిసరి. కరోనా
ప్రభావం వల్ల 2021, 2022 సంవత్సరాల్లో ఈ నిబంధన నుంచి విద్యార్థులకు
మినహాయింపు ఇచ్చారు. కరోనా లేకపోవడం, విద్యా సంవత్సరం సజావుగా సాగుతుండటం, 100
శాతం సిలబస్‌తో అన్ని పరీక్షలు జరుగుతుండటంతో ఈ నిబంధన నుంచి మినహాయింపు
ఇవ్వబోమని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి వెల్లడించారు.
ఇంటర్ మార్కుల వెయిటేజీపై ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీ అమలుపై ఉన్నత
విద్యామండలి అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. వెయిటేజీ అమలు చేయాలా ? వద్దా
? అన్న అంశాన్ని తేల్చాలని కోరుతూ ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
సర్కారు తుది నిర్ణయం ఆధారంగా వెయిటేజీ అంశం కొలిక్కిరానున్నది.