సీఐడీ డీజీగా రాచకొండ సీపీ మహేశ్ భగవత్
అవినీతి నిరోధకశాఖ డీజీగా రవి గుప్తా
రాచకొండ కమిషనర్‌గా డీఎస్ చౌహాన్
హైదరాబాద్: తెలంగాణ డీజీపీగా అంజనీకుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌కు
సీఐడీ డీజీగా నియమించారు. తెలంగాణ డీజీపీగా అంజనీకుమార్‌కు రాష్ట్ర ప్రభుత్వం
అదనపు బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రంలో ఆరుగురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ
ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌కు సీఐడీ డీజీగా బాధ్యతలు
అప్పగించారు. అవినీతి నిరోధకశాఖ డీజీగా రవి గుప్తా, రాచకొండ కమిషనర్‌గా
డీఎస్ చౌహాన్, హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా జితేందర్, శాంతిభద్రతల అదనపు
డీజీగా సంజయ్ కుమార్‌జైన్ నియమితులయ్యారు. రవిగుప్తాకు విజిలెన్స్ డీజీగా
బాధ్యతలు అప్పగించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు.
సీఎస్‌పై వ్యాజ్యం నేపథ్యంలో ఇప్పుడూ అదే విధానం అనుసరించాలని సర్కారు
భావిస్తోంది. మహేందర్‌రెడ్డి పదవీ విరమణ తర్వాత సీనియారిటీ జాబితాలో 1989
బ్యాచ్‌కు చెందిన ఉమేష్‌షరాఫ్, 1990 బ్యాచ్‌కు చెందిన అంజనీకుమార్,
రవిగుప్తాలు ఉన్నారు. వాస్తవానికి రాష్ట్రానికి రెండు క్యాడర్, రెండు
ఎక్స్‌క్యాడర్ డీజీపీ పోస్టులు ఉన్నాయి. నవంబరులో పదవీ విరమణ చేసిన
గోవింద్‌సింగ్ స్థానంలో అదనపు డీజీ స్థాయి అధికారికి డీజీపీగా పదోన్నతి
ఇవ్వవచ్చు. ఈ లెక్కన సీనియారిటీ జాబితాలో తర్వాతి స్థానంలో ఉన్న
రాజీవ్‌రతన్‌కు ఆ అవకాశం దక్కుతుంది. ఆయన మినహా మిగిలిన ముగ్గురి నుంచే ఒకర్ని
ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అందులో అంజనీకుమార్ వైపు సర్కారు
మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. అయితే ఆయన ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన
అధికారి. న్యాయస్థానం ఆదేశాల మేరకు తెలంగాణలో కొనసాగుతున్నారు. రాష్ట్ర
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్దీ అదే పరిస్థితి. సోమేశ్‌కుమార్
క్యాడర్‌కు సంబంధించి హైకోర్టులో వ్యాజ్యం నడుస్తోంది. వచ్చే నెలలో దీనిపై
తీర్పు వెలువడవచ్చని భావిస్తున్నారు. ఒకవేళ సోమేశ్‌కుమార్ ఆంధ్రప్రదేశ్‌కు
వెళ్లాల్సిందేనని న్యాయస్థానం ఆదేశించే పక్షంలో ఆ ప్రభావం అంజనీకుమార్
నియామకంపైనా పడుతుంది. ఈ నేపథ్యంలో డీజీపీ ఎంపిక విషయంలో ప్రభుత్వం ఆచితూచి
వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మధ్యే మార్గంగా తాత్కాలిక ప్రాతిపదికన
డీజీపీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.