బాన్సువాడ : బీర్కూరు మండలం, తిమ్మాపూర్ శివారులోని శ్రీ వెంకటేశ్వర స్వామి
“తెలంగాణ తిరుమల దేవస్థానం” కి రాష్ట్ర ప్రభుత్వం నుండి 66 ఎకరాల భూమిని
అధికారికంగా కేటాయించింది. భూమికి సంబంధించిన పత్రాలను దేవాదాయ శాఖ అధికారులకు
రెవెన్యూ శాఖ అధికారులు అప్పగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త, తెలంగాణ
రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, ఆలయ పాలక మండలి సభ్యులు,
బాన్సువాడ ఆర్డీవో రాజాగౌడ్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ సుప్రియ,
రెవెన్యూశాఖ, దేవాదాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ భూమి 66 ఎకరాలను
తెలంగాణ తిరుమల దేవస్థానం కి కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్
కి పాలకమండలి సభ్యులు, భక్తుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ఏప్రిల్ 2, 2016
న రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ దేవాలయానికి దర్శనానికి వచ్చినప్పుడు భక్తులకు
అవసరమైన మౌళిక వసతులు, సౌకర్యాలను కల్పించడానికి దేవాలయం చుట్టూ ఉన్న ప్రభుత్వ
భూమిని కెటాయిస్తామని తెలిపారు. వారి సూచనలకు అనుగుణంగా రెవెన్యూశాఖ నుండి
ఈరోజు భూమిని అధికారికంగా దేవాదాయశాఖకు అప్పగించారు. ఈ భూమిలో దేవాలయం తరపున
భక్తుల సౌకర్యాల కోసం అవసరమైన నిర్మాణాలు చేపడుతాం.