‘భగవంత్ కేసరి’గా బాలకృష
మాస్ యాక్షన్ జోనర్లోనే నడిచే కథ
మంచి మార్కులు కొట్టేసిన బాలయ్య లుక్
ఆసక్తిని పెంచుతున్న టీజర్ దసరాకి సినిమా విడుదల
బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది.
మాస్ యాక్షన్ జోనర్లోనే ఈ కథ నడవనుంది. సాహు గారపాటి – హరీశ్ పెద్ది
నిర్మిస్తున్న ఈ సినిమాకి, రీసెంట్ గా ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్ ను ఖరారు
చేశారు. టైటిల్ పట్ల .. బాలకృష్ణ లుక్ పట్ల ఆయన అభిమానులు హ్యాపీగా ఉన్నారు. ఈ
రోజున బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను రిలీజ్
చేశారు. ‘అడవి బిడ్డా .. నేలకొండ భగవంత్ కేసరి’ అంటూ తన గురించి తాను
చెప్పుకుంటూ బాలకృష్ణ యాక్షన్ లోకి దిగిపోవడం ఈ టీజర్ లో కనిపిస్తోంది. ‘ఈ
పేరు చానా ఏళ్లు యాదుంటది’ అనే బాలయ్య డైలాగ్ తో ముగించారు. తెలంగాణ యాసలో
బాలయ్య అదరగొట్టనున్నట్టు ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది. బాలకృష్ణ సరసన నాయికగా
కాజల్ కనిపించనుంది. ఇక ఆయన కూతురి పాత్రలో శ్రీలీల నటిస్తోంది. కథ అంతా కూడా
తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో కొనసాగనుంది. తన పాత్రకి గల ప్రాధాన్యత
కారణంగానే, శ్రీలీల అంగీకరించినట్టుగా చెబుతున్నారు. తమన్ సంగీతాన్ని
సమకూర్చిన ఈ సినిమాను ‘దసరా’కి విడుదల చేయనున్నారు.