హైదరాబాద్ : రాష్ట్ర ప్రొహిబిషన్ & ఎక్సైజ్, క్రీడ, పర్యాటక , సాంస్కృతిక,
పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్. వి .శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ టైక్వాండో అసోసియేషన్
ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జనవరి
20 నుండి 22 వరకు జరగనున్న తెలంగాణ స్టేట్ ఇంటర్ డిస్టిక్ టైక్వాండో
ఛాంపియన్షిప్ – 2023 నిర్వాహణ పై రూపొందించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలో
లీడర్ అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామన్నారు అందులో భాగంగా రాష్ట్రంలో
క్రీడా మైదానాల నిర్మాణాలను ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ నిర్మిస్తున్నామన్నారు
ఇప్పటికే 50 శాతం పైన ప్రారంభించమన్నారు. వీటితో పాటు గ్రామీణ క్రీడాకారులను
సుమారు 9500 గ్రామీణ క్రీడా ప్రాంగణాలను నిర్మించామన్నారు. ఈ క్రీడా ప్రాంగణాల
ద్వారా గ్రామీణ క్రీడలైన కబడ్డీ , వాలీబాల్, అథ్లెటిక్ లాంటి క్రీడలను
ప్రోత్సహిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక క్రీడాంశాలలో
తెలంగాణ రాష్ట్రం జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో అనేక పతకాలను సాధించి రాష్ట్ర
ప్రతిష్టను పెంపొందించే విధంగా కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే తెలంగాణకు
చెందిన క్రీడాకారులు అంతర్జాతీయ క్రీడావేదికైన కామన్వెల్త్ లో మెరుగైన
ప్రదర్శన చేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. బాక్సింగ్
ఛాంపియన్షిప్ లో నిఖత్ జరీన్ ఛాంపియన్ గా నిలిచి ఇతర క్రీడాకారులకు స్పూర్తి
నిచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను, క్రీడాకారులను, కోచ్ లను
ప్రోత్సహిస్తున్నామన్నారు.తెలంగాణ స్టేట్ ఇంటర్ డిస్టిక్ టైక్వాండో ఛాంపియన్షిప్ – 2023 లో సుమారు 1000
మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని వెల్లడించారు. 38 సబ్ జూనియర్ 6 క్యాడేట్
39 జూనియర్ 308 సీనియర్ విభాగాలను పోటీలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు
మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ
చైర్మన్ డా. ఈ ఆంజనేయ గౌడ్, తెలంగాణ టైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్
గౌడ్, సెక్రెటరీ ప్రవీణ్, శ్రీకాంత్, శ్రీహరి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.