హైదరాబాద్: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. తన
ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించాలని మంత్రి వేసిన పిటిషన్‌ను
మంగళవారం హైకోర్టు కొట్టివేసింది. శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదని 2019లో
రాఘవేంద్రరాజు పిటిషన్ వేశారు. ఆస్తులు, అప్పుల వివరాలు అఫిడవిట్లో
దాచిపెట్టారని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. రాఘవేంద్రరాజు వేసిన
పిటిషన్‌ను తిరస్కరించాలని మంత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మంత్రి
అభ్యంతరాలు పరిశీలించాలని గతంలో పిటిషన్‌ను సుప్రీంకోర్టు హైకోర్టుకు
పంపించింది. మంగళవారం వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం శ్రీనివాస్‌గౌడ్
అభ్యంతరాలను తోసిపుచ్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషన్‌పై విచారణను ఈ నెల
31వ తేదీకి వాయిదా వేసింది.